Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
Murder Case | వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి జే మైత్రేయి సంచలన తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
Murder Case | వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి జే మైత్రేయి సంచలన తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 2024 జూలై 10 అర్ధరాత్రి చెన్నారావుపేట మండలం చింతల తండాలో ఈ ఘోర ఘటన జరిగింది. గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు (బన్నీ) దీపికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, కుటుంబ సమస్యల నేపథ్యంలో దీపిక కొంతకాలం తర్వాత పుట్టింటికి వెళ్లడంతో, భార్య దూరమైందన్న కోపం నాగరాజులో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో కత్తితో దీపిక ఇంట్లోకి చొరబడిన నిందితుడు, కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దీపిక తల్లి సుగుణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తండ్రి శ్రీను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. దీపిక, ఆమె సోదరుడు మదన్ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. విచారణలో నెక్కొండ సీఐ శ్రీనివాస్ సేకరించిన ఆధారాలతో పోలీసులు బలమైన చార్జిషీట్ దాఖలు చేశారు. బాధితుల తరఫున స్పెషల్ పీపీ బృందాదేవి కోర్టులో వాదనలు వినిపించారు. నిందితుడి చర్య అత్యంత క్రూరంగా ఉందని, సమాజంలో ఇలాంటి నేరాలకు కఠిన శిక్ష అవసరమని ఆమె వాదించారు. ఈ మేరకు న్యాయస్థానం నిందితుడు మేక నాగరాజుకు మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



