Prakash Raj | మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి.. నాగబాబు ట్వీట్‌కు ప్రకాశ్‌రాజ్ కౌంటర్
Prakash Raj | 'మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు' అంటూ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jun 6, 2026, 11.54 am IST
Prakash Raj | నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చేస్తున్న ట్వీట్స్ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ట్వీట్‌కు ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) పరోక్షంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. దానికి ప్రకాశ్ రాజ్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. మేము బానిస బ్రతుకు బ్రతకడానికి గొర్రెలం కాదు.. ఈ బెదిరింపులు వద్దు అంటూ సంచలన ట్వీట్ చేశారు.
'నాయకుడి మాటే అంతిమం. ఏది ఒప్పో, ఏది తప్పో ఆయనకు మాత్రమే తెలుసు. మీ సందేహాలను పక్కనపెట్టండి.. సైలెంట్‌గా, ఎలాంటి ప్రశ్నలూ వేయకుండా నాయకుడిని అనుసరించండి' అంటూ జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్ చేశారు. దీనికి పవన్ కల్యాణ్ ఫొటోను జతచేశారు. ఇక ఈ పోస్టులో ప్రకాశ్ రాజ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే, ఆయన్ని ఉద్దేశించే ఈ ట్వీట్ పెట్టారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నాగబాబు ట్వీట్‌పై ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. 'మీ సందేహాలు ఆపేయండి. సైలెంట్‌గా నాయకుడ్ని అనుసరించడి అంటే అర్ధం ఏంటి..? మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థం అయిందా..?' అంటూ నాగబాబుకు ప్రకాష్ రాజ్ కౌంటరిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి.
ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు.
ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం… https://t.co/d3Y4nX5XkT— Prakash Raj (@prakashraaj) June 6, 2026
Also Read..
కాక్రోచ్ పార్టీ నిరసనకు ఢిల్లీ పోలీసుల అనుమతి.. బుక్, జాతీయ జెండాతో రావాలని అభిజీత్ పిలుపు
జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే.. ఐరాసలో పాక్ తీరును ఎండగట్టిన భారత్
తాజావార్తలు
- ●Harish Rao | కనకయ్య మరణం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే : ఎమ్మెల్యే హరీష్ రావు
- ●PM Modi | ఇరాన్ వార్ వేళ.. ఆర్థిక సలహా మండలి సభ్యులతో ప్రధాని కీలక భేటీ
- ●Citrus Juice | ఖాళీ కడుపుతో సిట్రస్ జ్యూస్ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- ●CJI | సీజేఐకి చేదు అనుభవం.. లండన్ కాలేజీలో కాక్రోచ్ వ్యాఖ్యలపై నిలదీత
- ●OnePlus Community Sale | వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్.. ఫ్లాగ్షిప్ ఫోన్లపై భారీ తగ్గింపులు..
- ●Venkataramana Reddy | విద్యార్థులు ఫీజు రీయింబర్స్ కోసం ఎదురుచూస్తున్నరు: ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి

Harish Rao | కనకయ్య మరణం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే : ఎమ్మెల్యే హరీష్ రావు

PM Modi | ఇరాన్ వార్ వేళ.. ఆర్థిక సలహా మండలి సభ్యులతో ప్రధాని కీలక భేటీ

Citrus Juice | ఖాళీ కడుపుతో సిట్రస్ జ్యూస్ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

CJI | సీజేఐకి చేదు అనుభవం.. లండన్ కాలేజీలో కాక్రోచ్ వ్యాఖ్యలపై నిలదీత






