త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కనకయ్య మరణం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే : ఎమ్మెల్యే హరీష్ రావు

Harish Rao | సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట మండల కేంద్రంలో మరణించిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్) మృతదేహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు.

S

Telangana | Published On Jun 6, 2026, 2.58 pm IST

Harish Rao | కనకయ్య మరణం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే : ఎమ్మెల్యే హరీష్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట మండల కేంద్రంలో మరణించిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్) మృతదేహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు.

అనంత‌రం హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతు కనకయ్యను బలి తీసింది. కనకయ్య మరణం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే. పండించిన పంటను 45 రోజులుగా కొనకుండా ఆలస్యం చేయడంతో, వర్షంలో వడ్లు తడ‌వ‌డంతో క‌న‌క‌య్య ఆవేద‌న చెందాడు. తడిచిన వడ్లు కొనాలని ప్రాధేయపడితే 40 సంచులు కట్ చేశారని రైతులకు, బంధువులకు చెబుతూ క‌ల‌త చెందాడని హ‌రీశ్‌రావు తెలిపారు.

నేను మళ్ళీ గెలుస్తా.. తొక్కుతా పండబెడతా అని తొండల భాష, తొత్తిరి భాష మాట్లాడుతున్నావ్ రేవంత్. రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటో ఒక్కటైన చెప్పు రేవంత్ రెడ్డి. ఎరువుల సరఫరాలో విఫలం.. రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్.. రైతులు చనిపోతే రైతు బీమా అందడం లేదు. రైతులు పండించిన పంట కొనక రైతులను బలి తీసుకుంటున్నారు. రెండు నెలల నుండి కల్లాల వద్ద వడ్లు పోసుకొని ఎదురుచూస్తున్న రైతుల గోస కనపడటం లేదా రేవంత్ రెడ్డి? దుబ్బాక నియోజకవర్గంలోని చేర్వాపూర్‌లో సంచులు ఎత్తకపోవడంతో చెదలు పట్టిన దుస్థితి. మంత్రి రాజనర్సింహ నియోజకవర్గంలోని వెంకటాపూర్‌లో నేటికి ఒక్క క్వింటాలు కొనలే. మరణించిన కనకయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎలాంటి కోతలు లేకుండా వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement