OnePlus Community Sale | వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై భారీ తగ్గింపులు..
OnePlus Community Sale | స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ తన కమ్యూనిటీ సేల్ 2026ని భారత్‌లో అధికారికంగా ప్రారంభించింది. ఈ పరిమిత కాలపు సేల్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు వన్‌ప్లస్ ఇండియా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి.
Technology | Published On Jun 6, 2026, 2.04 pm IST
OnePlus Community Sale | స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ తన కమ్యూనిటీ సేల్ 2026ని భారత్‌లో అధికారికంగా ప్రారంభించింది. ఈ పరిమిత కాలపు సేల్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు వన్‌ప్లస్ ఇండియా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో వన్‌ప్లస్ 15 ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3వేల బ్యాంక్ డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది. దీంతో దీని ప్రభావిత ధర రూ.77,999 నుంచి రూ.74,999కు తగ్గింది. అలాగే వన్‌ప్లస్ 15ఆర్‌పై కూడా ఇదే స్థాయి బ్యాంక్ ఆఫర్ లభిస్తుండగా, దీని ప్రభావిత ధర రూ.51,999కు చేరింది.
మంచి ఎంపికగా వన్‌ప్లస్ 13..
ప్రీమియం ధర చెల్లించకుండా ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని కోరుకునే వారికి వన్‌ప్లస్ 13 మంచి ఎంపికగా మారింది. అసలు ధర రూ.69,999గా ఉన్న ఈ ఫోన్‌పై తాత్కాలికంగా రూ.12వేల ధర తగ్గింపు, అదనంగా రూ.5వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తున్నాయి. దీంతో దీని ప్రభావిత ధర కేవలం రూ.52,999కు పడిపోయింది. మరోవైపు కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చిన వన్‌ప్లస్ 13ఎస్‌పై రూ.2వేల డిస్కౌంట్‌తో పాటు రూ.3వేల బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఫలితంగా దీని ప్రభావిత ధర రూ.49,999గా మారింది. వన్‌ప్లస్ తన కమ్యూనిటీ సేల్ ఆఫర్లను నార్డ్ సిరీస్‌కు కూడా విస్తరించింది. తాజా వన్‌ప్లస్ నార్డ్ 6పై రూ.2వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుండగా, దీని ధర రూ.40,999గా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ6పై రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత ప్రభావిత ధర రూ.29,999గా ఉంటుంది. అలాగే నార్డ్ సీఈ6 లైట్‌పై రూ.1,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభించడంతో దీని ధర రూ.21,499కు తగ్గింది.
క్రెడిట్ కార్డు ఆఫర్లు..
అర్హత కలిగిన మోడళ్లపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లతోపాటు ట్యాబ్లెట్లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ ప్యాడ్ 4పై రూ.3వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుండగా, దీని ప్రభావిత ధర రూ.56,999గా ఉంది. వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ధర రూ.26,999కు లభిస్తోంది. ప్యాడ్ లైట్‌పై వర్తించే డిస్కౌంట్ల తర్వాత దీన్ని రూ.16,999కే కొనుగోలు చేయవచ్చు. అలాగే పరిమిత కాలం పాటు వన్‌ప్లస్ ప్యాడ్ 4 కొనుగోలు చేసిన వారికి స్టైలో ప్రోను ఉచితంగా, ప్యాడ్ గో 2 కొనుగోలు చేసిన వారికి స్టైలో గో 2ను ఉచితంగా అందిస్తోంది.
ఆడియో ఉత్పత్తులపై..
ఆడియో ఉత్పత్తుల విభాగంలో వన్‌ప్లస్ బడ్స్ 4 ధర రూ.6,099 ఉండగా, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3ను రూ.11,999కు కొనుగోలు చేయవచ్చు. అలాగే నార్డ్ బడ్స్ 3, నార్డ్ బడ్స్ 3 ప్రో, నార్డ్ బడ్స్ 4 ప్రో, బులెట్స్ వైర్‌లెస్ జెడ్2 ఏఎన్‌సీ, బులెట్స్ వైర్‌లెస్ జెడ్3 వంటి ఇతర ఉత్పత్తులపై కూడా ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, బ్లింకిట్, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల వద్ద అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ జూన్ 10 వరకు కొనసాగనుండగా, కొన్ని బండిల్ ఆఫర్లు, ప్రమోషనల్ ప్రయోజనాలు మాత్రం జూన్ 7 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OnePlus Nord 6 | 9000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..?
ఏప్రిల్ 8, 2026

Oneplus 15 | వన్ ప్లస్ 15 ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా..? అయితే ఇదే చాన్స్..!
జనవరి 1, 2026

OnePlus 15R | వన్‌ప్లస్ 15ఆర్ వచ్చేసింది.. ఫీచర్లు అదిరిపోయాయ్.. ధర ఎంతంటే..?
డిసెంబర్ 18, 2025
తాజావార్తలు
- ●Harish Rao | కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని మళ్లీ ఓడగొడుతాం.. తేల్చిచెప్పిన హరీశ్‌రావు
- ●Maheshkumar Goud | కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి: మహేశ్‌కుమార్‌గౌడ్
- ●Cockroach Janta Party | సోషల్ మీడియాలో పోస్టులను చెరిపేయగలరేమో.. మమ్మల్ని కాదు : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్
- ●Kavitha| ప్రాణం పోయినా ఇంచు భూమిని కూడా దోపిడీ కానివ్వం
- ●Delhi Hotel Fire | కుక్ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీ హోటల్లో మంటలు.. వెలుగులోకి కీలక విషయాలు
- ●Meta | ఫేస్బుక్ క్రియేటర్లకు మెటా ఏఐ గిఫ్ట్.. కొత్త క్రియేటర్ అసిస్టెంట్ తో సక్సెస్ రహస్యాలు మీ చేతిలో..

Harish Rao | కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని మళ్లీ ఓడగొడుతాం.. తేల్చిచెప్పిన హరీశ్‌రావు

Maheshkumar Goud | కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి: మహేశ్‌కుమార్‌గౌడ్

Cockroach Janta Party | సోషల్ మీడియాలో పోస్టులను చెరిపేయగలరేమో.. మమ్మల్ని కాదు : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్

Kavitha| ప్రాణం పోయినా ఇంచు భూమిని కూడా దోపిడీ కానివ్వం



