Chiranjeevulu | తెలుగు అనే పదం పుట్టిందే తెలంగాణలో.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవులు ఫైర్
Chiranjeevulu | ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండటం పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) నచ్చడం లేదని బీసీ ఇంటలెక్చ్యువల్ ఫోరమ్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు (Chiranjeevulu) అన్నారు. మా భాష, యాసను అవహేళన చేశారని మండిపడ్డారు. మహానాడులో తెలంగాణ (Telangana) పదం లేదని మాట్లాడారని, అలసు తెలుగు అనే పదం పుట్టిందే తెలంగాణలో అని చెప్పారు.
Chiranjeevulu | త్రినేత్ర.న్యూస్: ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండటం పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) నచ్చడం లేదని బీసీ ఇంటలెక్చ్యువల్ ఫోరమ్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు (Chiranjeevulu) అన్నారు. మా భాష, యాసను అవహేళన చేశారని మండిపడ్డారు. మహానాడులో తెలంగాణ (Telangana) పదం లేదని మాట్లాడారని, అలసు తెలుగు అనే పదం పుట్టిందే తెలంగాణలో అని చెప్పారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఇంటలెక్చ్యువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ దేశోద్దారక భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రజలు అక్కడ పాలన చేయుమని మిమ్మల్ని ఎన్నుకున్నారని, అది వదిలేసి తెలంగాణలో పోటీ చేస్తానని తిరుగుతున్నారని విమర్శించారు. మీవ్వు పోటీ చేస్తా అంటే ఎవరు అపుతున్నారని ప్రశ్నించారు. గతంలో కూడా ఇక్కడ పోటీ చేశారని గుర్తుచేశారు. అయినా ఎవరికీ ఓటు వేయాలో ఇక్కడి ప్రజలకు తెలుసని చెప్పారు.
మా బాష, యాసను అవహేళన చేశారని విమర్శించారు. కొండగట్టుకు పైసలు ఇచ్చానని అంటున్నావు కాదా, తాము వెంకటేశ్వర స్వామికి కానుకలు చెల్లిస్తలేమా అని ప్రశ్నించారు. మా చూపుతో కొనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఆంధ్ర ప్రజలు అంటే విద్వేషం లేదని, మీ పాలనతో విసిగిపోయే తెలంగాణ తెచ్చుకున్నామని వెళ్లడించారు.
ప్రజల మధ్య విష బీజాలు నాటే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అంటే చంద్రబాబు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. వాళ్లు అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే ఇలా పక్కదారి పట్టిస్తున్నారని ఆక్షేపించారు. పవన్ పలుకులు చంద్రబాబు, బీజేపీ పలుకులుగా ఉన్నాయని చెప్పారు. బీసీ ఉద్యమాన్ని అనచడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రాబోయే కాలం బహుజనులదేనని, 2028లో బహుజనుల రాజ్యం సాధించుకోవాల్సిందేనన్నారు.
చంద్రబాబు వద్ద పవన్‌ది బంట్రోతు ఉద్యోగం: బాలరాజ్ గౌడ్
చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ బంట్రోతు ఉద్యోగం చేస్తున్నాడని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ విమర్శించారు. పోటీచేసిన రెండు చోట్ల ఓడిన చరిత్ర పవన్ కల్యాణ్‌ది అని ఎద్దేవా చేశారు. తెలంగాణ మా అయ్యల జాగిరేనని స్పష్టం చేశారు. మొదలు నీ ప్రజలకు న్యాయం చేయాలంటూ హితవు పలికారు.
తమ దగ్గర ఉంటూ.. గండిపేట నీళ్లు తాగుతూ, పారడైస్ బిర్యాని తింటూ ఎంజాయ్ చేస్తున్నావని, కానీ తమను రెచ్చగొట్టొద్దన్నారు. ప్రజారాజ్యం పార్టీని గంపగుత్తగా అమ్ముకున్న చరిత్ర మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. `నువ్వు మంచి నటుడువే, అలాగే నటించు. కానీ డొప్ప కింద డొప్ప లాగా ఉండకు` అని సూచించారు. పవన్ కల్యాణ్ అనే బంట్రోత్‌ను తీసుకోచ్చి ఇక్కడ రెచ్చ గొట్టె వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో తొమ్మిందేడ్లు దొర పాలించిండు, గత రెండేండ్ల నుండి పటేల్ పాలిస్తున్నాడు, మరి బీసీలు ఎప్పుడు పాలిస్తారు.. అని బాలరాజ్ గౌడ్ అన్నారు.
తాజావార్తలు
- ●Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింట్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్
- ●Revanth Reddy | ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.. కాట్రేవులపల్లి ఎత్తిపోతల పనుల పరిశీలన
- ●Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే 'సేఫ్టీ నెట్'గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి
- ●Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలి: ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్
- ●Rain | జనగామలో దంచికొట్టిన వాన.. కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు
- ●Rajesh Exports Scam | హర్షద్ మెహతా కంటే పెద్ద స్కామ్: రూ.15 లక్షల కోట్ల బోగస్ లెక్కలతో దొరికిపోయిన 'రాజేష్ ఎక్స్‌పోర్ట్స్'

Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింట్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్

Revanth Reddy | ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.. కాట్రేవులపల్లి ఎత్తిపోతల పనుల పరిశీలన

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే 'సేఫ్టీ నెట్'గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి

Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలి: ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్




