Gutha Sukhender Reddy | ముందు నీ భాష మార్చుకో.. పవన్ కల్యాణ్‌కు మండలి చైర్మన్ చురక
Gutha Sukhender Reddy | తెలంగాణ మీ అయ్యా జాగీరా? అని ప్రశ్నించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) విమర్శల దాడి ఆగడం లేదు. పవన్ కల్యాణ్ తన భాషను మార్చుకోవాలని, రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy) హితవు పలికారు.
Gutha Sukhender Reddy | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ మీ అయ్యా జాగీరా? అని ప్రశ్నించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) విమర్శల దాడి ఆగడం లేదు. పవన్ కల్యాణ్ తన భాషను మార్చుకోవాలని, రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy) హితవు పలికారు. అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సం రోజున ఆయన సభ పెట్టాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే పవన్ సభ ఏంటని ప్రశ్నించారు. పరస్పర దూషణలు సరైంది కాదని, తెలంగాణలో విద్వేషాలు పెట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.
కూటమి నేతలు అమరావతిని బ్రహ్మండమైన రాజధాని అంటున్నారని గుర్తు చేశారు. ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, దానికి పవన్ కల్యాణ్ వంత పాడుతున్నారని విమర్శించారు. అలాంటప్పుడు షటిల్ సర్వీసులు బంద్ చేసుకోవాలని, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అక్కడే నివాసం ఉండాలని సూచించారు. అమరావతి రాజధాని అని చెబుతున్నప్పుడు నాయకులు అక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటామంటే ఎలా? అలా కుదరదు కదా! అని చురకలు అంటించారు. తెలంగాణ కన్నా ఏపీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అక్కడ సముద్ర తీరం ఉందని, రకరకాల పోర్టులున్నాయి వివరించారు. ఏపీ అభివృద్ధి చూసుకోవాలి తప్ప తెలంగాణ వైపు చూడొద్దని చెప్పారు.
తాజావార్తలు
- ●Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి

Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!





