Nayanthara | లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన నయనతార.. ధర తెలిస్తే షాకే..!
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. పోయెస్ గార్డెన్ (Poes Garden)లో భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)తో కలిసి లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ (Duplex Apartment)ను కొనుగోలు చేశారు.
Entertainment | Published On Mar 6, 2026, 1.04 pm IST
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. చెన్నైలో తైనాంపేట (Teynampet)లో ప్రముఖులు ఉండే పోయెస్ గార్డెన్ (Poes Garden)లో భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)తో కలిసి లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ (Duplex Apartment)ను కొనుగోలు చేశారు. గతేడాది డిసెంబర్ 15న ల్యాండ్‌మార్క్ మెట్రో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఆ ఆస్తిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
డాక్యుమెంట్ల ప్రకారం.. పోయెస్ గార్డెన్‌లోని ‘లెగసీ’ (Legacy) అనే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. నాలుగు, ఐదో అంతస్తుల్లో ఈ డూప్లెక్ ఇల్లు ఉంది. దీని ఖరీదు రూ.31.5 కోట్లు. ఈ ప్రాపర్టీ మొత్తం 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఒక్కో చదరపు అడుగు ధర సుమారు రూ.21,946తో ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాపర్టీ కోసం రూ.2.86 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలిసింది. ఈ లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సేల్ డీడ్ గతేడాది డిసెంబర్‌లో నమోదైంది.
నయన్‌కు 90%, విఘ్నేశ్‌కు 10%
ఈ ఆస్తిలో నయనతారకు 90 శాతం వాటా ఉండగా ఆమె భర్త విఘ్నేష్ శివన్‌కు 10 శాతం వాటా ఉంది. ఎనిమిది రిజర్వ్డ్ కార్ పార్కింగ్ స్లాట్లు ఈ అపార్ట్‌మెంట్‌తో పాటు కేటాయించారు. పోయెస్ గార్డెన్ అంటేనే వీవీఐపీలకే కేరాఫ్ అడ్రెస్. సినీ, రాజకీయ ప్రముఖులు ఇక్కడే నివసిస్తుంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ధనుష్ వంటి స్టార్లు ఇక్కడ లగ్జరీ నివాసాలను కొనుగోలు చేశారు. అలాంట ప్రైమ్ ఏరియాలో నయన్ ప్రాపర్టీ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.
నయనతారకు ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, కేరళ సహా పలు నగరాల్లో ప్రాపర్టీలు ఉన్నాయి. చెన్నైలో ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. దాని విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఇక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సుమారు రూ.15 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లు ఉన్నట్లు సమాచారం. వాటితోపాటూ.. నయనతారకు కేరళలోని తన పూర్వీకుల ఇల్లు కూడా ఉంది. ఇది ఆ రాష్ట్రంలోనే అత్యంత విలాసవంతమైన ఇళ్లలో ఒకటి కావడం విశేషం.
సినిమాల విషయానికొస్తే.. నయనతార ఇటీవలే చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రంలో నయనతార, చిరంజీవితోపాటూ మరో టాలీవుడ్ స్టార్ వెంకటేష్ కూడా ముఖ్యపాత్రలో కనిపించారు.
Also Read..
Britney Spears | మద్యం సేవించి డ్రైవింగ్.. పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ అరెస్ట్
Minister Ponnam Prabhakar | ప్రతీ మహిళా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి : మంత్రి పొన్నం
Vitamin B12 Supplements | విటమిన్ బి12 సప్లిమెంట్లను రోజూ తీసుకోవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






