త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponnam Prabhakar | ప్ర‌తీ మ‌హిళా ఉపాధి అవ‌కాశాల‌ను పెంపొందించుకోవాలి : మంత్రి పొన్నం

Minister Ponnam Prabhakar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం 99 రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంద‌ని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు.

D

Telangana | Published On Mar 6, 2026, 12.23 pm IST

Minister Ponnam Prabhakar | ప్ర‌తీ మ‌హిళా ఉపాధి అవ‌కాశాల‌ను పెంపొందించుకోవాలి : మంత్రి పొన్నం
Advertisement

Minister Ponnam Prabhakar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం 99 రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంద‌ని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. గ్రామాలు, వార్డుల నుంచి రాజ‌ధాని వ‌ర‌కూ ఈ కార్య‌క్రమాలు కొన‌సాగుతాయ‌ని అన్నారు. చాచా నెహ్రూ పార్క్‌లో స్వ‌యం స‌హాయ‌క సంఘాల ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప‌లు కార్య‌క్ర‌మాల‌ను మంత్రి ఇవాళ ప్రారంభించారు.

ఇందిరా మ‌హిళా శ‌క్తి క్యాంటీన్‌, న‌గ‌రంలోనే మొట్ట మొద‌టిసారిగా ఏర్పాటు చేసిన అద్దాల లైబ్ర‌రీని, ఈ వ్య‌ర్థాల సేక‌ర‌ణ సెంట‌ర్‌ను ప్రారంభించారు. మ‌హిళా సంఘాల‌కు రూ.35 కోట్ల సున్నా వడ్డీ రుణాల చెక్కుల‌ను అంద‌జేశారు. అనంత‌రం మ‌హిళా సంఘాల‌తో ముఖాముఖి స‌మావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. "ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచన‌ల మేర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని ఇక్క‌డ ప్రారంభించాం. 12 వేల గ్రామాల్లో, వార్డుల్లో, మున్సిపాలిటీల్లో ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంది" అని తెలిపారు.

వాటివ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు.. రీసైక్లింగ్ చేయాలి

పాడైపోయిన‌ టీవీలు, పాత ఫ్రిడ్జ్‌లు, కంప్యూట‌ర్లు, ల్యాప్‌టాప్‌లు మ‌న ఇళ్ల‌లో ఉంచుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని మంత్రి అన్నారు. వాటిని ఈ వ్య‌ర్థాల సేక‌ర‌ణ సెంట‌ర్‌కు తెచ్చి రీసైక్లింగ్ చేయాల‌న్నారు. అదేవిధంగా 1500 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లంలో ఏర్పాటు చేసిన గ్రాంథాల‌యాన్ని ప్రారంభించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఈ లైబ్ర‌రీ స్థానిక ప్ర‌జ‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. అంతేకాదు, ఇక్క‌డ పుస్త‌కాలు డొనేట్ చేసేందుకు ప్ర‌త్యేకంగా సెంట‌ర్‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.

మ‌హిళా సంఘాల్లో చేరాలి..

పట్ట‌ణంలో మ‌హిళా సంఘాల స‌భ్యుల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంద‌ని మంత్రి అన్నారు. అందుకే ప్ర‌తీ మ‌హిళా ఈ సంఘంలో చేరాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వం ఇస్తున్న సున్నా వ‌డ్డీ రుణాలు పొంది ఉపాధి అవ‌కాశాలు పెంచుకోవాల‌ని సూచించారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సుతోపాటూ అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, స‌న్న బియ్యం, రేష‌న్ కార్డులు మ‌హిళ‌ల పేరు మీదే ఇస్తున్న‌ట్లు చెప్పారు. ఐకేపీ, మ‌హిళా సంఘాల త‌ర‌ఫున బ‌స్సులు ఆర్టీసీలో న‌డుస్తున్న‌ట్లు చెప్పారు. బ‌స్సుల‌కు మ‌హిళ‌ల‌ను య‌జ‌మానుల‌ను చేసిన‌ట్లు తెలిపారు.

సెట్విన్ ద్వారా స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌ర్చేందుకు ప్ర‌త్యేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. కుట్టు మిష‌న్లు అందిస్తున్నామ‌న్నారు. మ‌హిళ‌లు త‌మ కాళ్ల‌మీద వారు నిల‌బ‌డాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన 99 రోజుల కార్యాచ‌ర‌ణ‌లో చురుగ్గా పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. విద్య‌, వైద్యం, ప‌ర్యావ‌ర‌ణం, భ‌ద్ర‌త ఇలా అన్ని కార్య‌క్ర‌మాల్లో మ‌హిళ‌లు భాగం కావాల‌ని సూచించారు. వారు ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని ఆకాంక్షించారు.

Also Read..

Harish Rao | తెలంగాణ ప్రజల గొంతు కోసి.. కేరళలో కలర్ పేజీ యాడ్స్.. కాంగ్రెస్‌పై హ‌రీశ్ ఆగ్ర‌హం

MLA Raj Thakur | డిప్యూటీ సీఎం కుమారుడి పెండ్లి వేడుక‌.. క‌త్తి తిప్పిన రామ‌గుండం ఎమ్మెల్యే

Divvela Madhuri | తిరుమ‌ల‌లో త‌నూజ బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసిన దివ్వెల మాధురి - కేసు న‌మోదు చేసిన పోలీసులు

Advertisement
Advertisement