త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajinikanth | ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ మ‌హేష్‌బాబు – మూడోసారి బాక్సాఫీస్ క్లాష్ – “ధ‌ర్మ‌న్” రిలీజ్ డేట్ ఇదే!

ద‌క్షిణాది అగ్ర క‌థానాయ‌కులు ర‌జ‌నీకాంత్ , మ‌హేష్‌బాబు త‌మ సినిమాల‌తో మూడోసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్‌, మ‌హేష్‌బాబు వార‌ణాసి వారం గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. వార‌ణాసి ఎప్రిల్ 7న విడుద‌ల కాబోతుండ‌గా...ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్ ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.

N

Entertainment | Published On Nov 27, 2026, 2.32 pm IST

Rajinikanth | ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ మ‌హేష్‌బాబు – మూడోసారి బాక్సాఫీస్ క్లాష్ – “ధ‌ర్మ‌న్” రిలీజ్ డేట్ ఇదే!
Advertisement

Rajinikanth |  వ‌చ్చే ఏడాది వేస‌విలో ఇద్ద‌రు స్టార్ హీరోలు సినిమాలు వారం రోజుల గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. మ‌హేష్‌బాబుతో బాక్సాఫీస్ పోటీకి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ర‌జ‌నీకాంత్ హీరోగా క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాణంలో రూపొందుతోన్న మూవీ ధ‌ర్మ‌న్‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

శ్రీలీల స్పెష‌ల్ సాంగ్‌...

న‌య‌న‌తార‌, సిమ్రాన్‌, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతుంది. ధ‌ర్మ‌న్ షూటింగ్ జెట్‌స్పీడ్‌లో సాగుతోంది. ఈ త‌మిళ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. ధ‌ర్మ‌న్ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త‌మిళ డిస్ట్రిబ్యూట‌ర్‌తిరుప్పూర్ సుబ్ర‌మ‌ణియ‌మ్ లీక్ చేశారు.

రిలీజ్ డేట్‌...

ధ‌ర్మ‌న్ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని, ఏప్రిల్ 14 ఎట్టిప‌రిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంద‌ని సుబ్ర‌మ‌ణియ‌మ్ పేర్కొన్నారు. అలాగే క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ హీరోలుగా నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ కూడా మార్చి నుంచి సెట్స్‌పైకి రానున్న‌ట్లు వెల్ల‌డించారు.ధ‌ర్మ‌న్‌కు వారం రోజుల ముందు ఏప్రిల్ 7న మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న వార‌ణాసి రిలీజ్ కాబోతుంది. వార‌ణాసికి పోటీగా ధ‌ర్మ‌న్ ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ర‌జ‌నీకాంత్‌, మ‌హేష్‌బాబు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌నుండ‌టం ఇది మూడోసారి. గ‌తంలో ర‌జ‌నీకాంత్ ద‌ర్బార్ , మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు ఒకేసారి విడుద‌ల‌య్యాయి. ఆ త‌ర్వాత ఖ‌లేజా, రోబో వారం గ్యాప్‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేశాయి. ఈ క్లాష్‌లో ర‌జ‌నీకాంత్‌, మ‌హేష్‌బాబు త‌లోసారి విజేత‌లుగా నిలిచారు.

రామ్ పోతినేని....

ధ‌ర్మ‌న్‌లో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాలో అత‌డు విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాతోనే రామ్ న‌టుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.

Advertisement
Advertisement