త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | అది నా పూర్వ‌జ‌న్మ సుకృతం.. ప్ర‌త్యేక వీడియో షేర్ చేసిన చిరంజీవి

Chiranjeevi | నేడు హ‌నుమాన్ జ‌యంతి (Hanuman Jayanti). ఈ సంద‌ర్భంగా ఆ హ‌నుమంతుడి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు ఆల‌యాల‌కు పోటెత్తారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హ‌నుమంతుడికి ప‌ర‌మ‌భ‌క్తుడ‌న్న విష‌యం తెలిసిందే.

D

Entertainment | Published On Apr 2, 2026, 10.39 am IST

Chiranjeevi | అది నా పూర్వ‌జ‌న్మ సుకృతం.. ప్ర‌త్యేక వీడియో షేర్ చేసిన చిరంజీవి
Advertisement

Chiranjeevi | నేడు హ‌నుమాన్ జ‌యంతి (Hanuman Jayanti). ఈ సంద‌ర్భంగా ఆ హ‌నుమంతుడి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు ఆల‌యాల‌కు పోటెత్తారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హ‌నుమంతుడికి ప‌ర‌మ‌భ‌క్తుడ‌న్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అభిమానుల‌కు హ‌నుమాన్ జ‌యంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. "అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను" అంటూ ఓ ప్ర‌త్యేక వీడియోని షేర్ చేశారు. అందులో మెగాస్టార్ ఇంట్లో చోటు చేసుకునే ఓ అపురూప దృశ్యం గురించి అభిమానుల‌కు వివ‌రించారు.

"హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా మా పూజా మందిరంలో జ‌రుగుతున్న ఒక‌ విశేషాన్ని మీతో పంచుకోవ‌డానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్ర‌తి సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌, జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో సూర్య‌కిర‌ణాలు స‌ప్త‌వ‌ర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హ‌నుమంతుడిని పై నుంచి కింది వ‌ర‌కూ స్పృశిస్తూ ప్ర‌స‌రించ‌డం చూస్తుంటే.. ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటల్లో చెప్ప‌లేనిది. ఇటీవ‌లే మ‌నం అయోధ్య‌లో బాల‌రాముడి నుదుటిపై సూర్య‌కాంతి ప్ర‌సురించి మెరిసిన అద్భుత దృశ్యాన్ని చూశాం. అలాగే కోణార్క్‌, అర‌స‌వ‌ల్లి దేవాల‌యాల్లో కూడా సూర్య‌కిర‌ణాలు భ‌గ‌వంతుడిని తాకే విశేషం అంద‌రికీ తెలిసిందే. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజ‌నేయుడిని స్మృశించ‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ ప‌విత్ర‌మైన హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా అంద‌రికీ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు" అని చిరంజీవి ఆ వీడియోలో తెలిపారు.

Also Read..

RGUKT | బాస‌ర ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాలు.. మే 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్ వీడియో లీక్ - డౌట్స్‌కు చెక్ పెట్టిన రౌడీబాయ్‌

Nayanthara | రెమ్యూనరేషన్‌లో స‌ల్మాన్‌ఖాన్‌ను దాటేసిన‌ న‌య‌న‌తార - బాలీవుడ్‌లో లేడీ సూప‌ర్ స్టార్ హ‌వా

Advertisement
Advertisement