త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | ఆ ల‌క్ష్య‌మే న‌న్ను మెగాస్టార్‌గా మార్చింది – న‌షా ముక్త్ భార‌త్ కార్య‌క్ర‌మంలో చిరంజీవి కామెంట్స్‌

డ్ర‌గ్స్ ఫ్రీ హైద‌రాబాద్ ల‌క్ష్యంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి చేప‌ట్టిన వాక్ ఫ‌ర్ న‌షా ముక్త్ భార‌త్ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. మ‌త్తు ప‌దార్థాలు, డ్ర‌గ్స్‌కు యువ‌త బానిస‌లుగా మార‌కూడ‌ద‌ని పిలుపునిచ్చారు. కెరీర్ ఆరంభంలో త‌న‌కు ఎదురైన అనుభ‌వాల‌ను ఆహుతుల‌తో పంచుకున్నారు.

N

Entertainment | Published On Nov 27, 2026, 8.29 pm IST

Chiranjeevi | ఆ ల‌క్ష్య‌మే న‌న్ను మెగాస్టార్‌గా మార్చింది – న‌షా ముక్త్ భార‌త్ కార్య‌క్ర‌మంలో చిరంజీవి కామెంట్స్‌
Advertisement

Chiranjeevi |  డ్ర‌గ్స్ ఫ్రీ హైద‌రాబాద్ ల‌క్ష్యంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మూడు రోజుల పాటు జ‌రుగుతున్న హైద‌రాబాద్ వాక్ ఫ‌ర్ న‌షా ముక్త్ భార‌త్ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ వేడుక‌లో కెరీర్ ఆరంభంలో త‌న‌కు ఎదురైన అనుభ‌వాల‌పై చిరంజీవి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. మ‌త్తు ప‌దార్థాలు యువ‌త జీవితాల‌ను చిన్నాభిన్నం చేస్తాయ‌ని అన్నారు.

పాండీ బ‌జార్‌లో...

48 సంవ‌త్స‌రాల క్రితం...22 సంవ‌త్స‌రాల యువ‌కుడిగా తాను హీరో కావాల‌ని మ‌ద్రాస్‌లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయిన‌ట్లు చిరంజీవి చెప్పారు. "పాండీ బ‌జార్‌లో అప్ప‌ట్లో ఆర్టిస్టులు అంద‌రూ కాల‌క్షేపం కోసం సాయంత్రం స‌మావేశ‌మ‌య్యేవారు. కొత్త‌లో స్నేహితుడు అడ‌గ‌టంతో టీ తాగ‌డానికి అక్కడకు వెళ్లాను. ఆ వాతావ‌ర‌ణం కొత్త‌గా ఉండ‌టంతో అయోమ‌యానికి లోన‌య్యాను. నాలోని క‌న్ఫ్యూజ‌న్‌ను పోగొట్ట‌డానికి మందు తాగ‌మ‌ని మ‌రో స్నేహితుడు బ‌ల‌వంతం చేశాడు. కానీ నాకు అల‌వాటు లేద‌ని చెప్పాను. ఇండ‌స్ట్రీలో ఇదంతా కామ‌న్ అని... అల‌వాటు చేసుకోవాల‌ని అన్నాడు. కానీ నేను ఆంజ‌నేయుడు భ‌క్తుడిన‌ని మందు ముట్ట‌న‌ని ఖ‌రాఖండిగా చెప్పాను. నా మాట మీదే నిల‌బ‌డ్డాను. ఇంకోసారి అలాంటి చోటుకు వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. నా దృష్టిని ల‌క్ష్యం మీదే పెట్టాను కాబ‌ట్టే మెగాస్టార్‌గా మారాను" అని చిరంజీవి అన్నారు.

యువ‌త బానిస‌లుగా

చెడు అల‌వాట్ల‌కు యువ‌త దూరంగా ఉండాల‌ని ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి పిలుపునిచ్చారు. డ్ర‌గ్స్‌, మ‌త్తు ప‌దార్థాల‌కు యువ‌త బానిస‌లుగా మార‌కూడ‌ద‌ని అన్నారు. నిర్ధిష్ట‌మైన ల‌క్ష్యాన్ని విధించుకొని...దానిని సాధించేందుకు క‌ష్ట‌ప‌డాల‌ని, త‌ల్లిదండ్రుల‌తో పాటు స‌మాజం గ‌ర్వించే విధంగా అత్యున్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని పిలుపునిచ్చారు. డ్ర‌గ్స్ ఫ్రీ గా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని చేప‌ట్టేందుకు కిష‌న్ రెడ్డి చేప‌ట్టిన ఈ పాద‌యాత్ర యువ‌త‌లో స్ఫూర్తిని నింపుతుంద‌ని అన్నారు.

Advertisement
Advertisement