Vijay Deverakonda | విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్ వీడియో లీక్ – డౌట్స్‌కు చెక్ పెట్టిన రౌడీబాయ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న రణబాలి మూవీ నుంచి షూటింగ్ వీడియో లీకైంది. ఈ లీక్‌డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రాయలసీమ స్లాంగ్‌లో విజయ్ చెప్పిన డైలాగ్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Entertainment | Published On Apr 2, 2026, 9.31 am IST
Vijay Deverakonda | పెళ్లి తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మూవీ రణబాలి. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పాన్ ఇండియన్ మూవీలో బ్రిటీషర్లను ఎదురించి పోరాడిన రాయలసీమ యోధుడు రణబాలిగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. అతడి భార్య జయమ్మగా రష్మిక మందన్న నటిస్తోంది.
అనంతపూర్‌లో షూటింగ్...
పెళ్లి కోసం నెల రోజుల పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన విజయ్, రష్మిక ఇటీవలే రణబాలి సెట్స్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం అనంతపూర్‌లో రణబాలి షూటింగ్ జరుగుతోంది. విజయ్, రష్మికలపై కీలక సన్నివేశాలను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ చిత్రీకరిస్తున్నారు. కాగా రణబాలి షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో లీకైంది. ఇందులో కత్తి పట్టుకొని గుర్రంపై విలన్ ఇంటికే వచ్చిన విజయ్ దేవరకొండ అతడికి వార్నింగ్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ లీక్‌డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో విజయ్ లుక్ బాగుందని, డైలాగ్ డెలివరీతోకుమ్మేశాడని నెటిజన్లు అంటున్నారు.
రాయలసీమ స్లాంగ్‌లో...
రణబాలి కథ మొత్తం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ రాయలసీమ స్లాంగ్‌ను నేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ మాటల్లో ఎక్కువగా తెలంగాణ యాస కనిపిస్తుంది. అతడి రాయలసీమ మాడ్యులేషన్‌పై అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమవుతూవచ్చాయి. కానీ ఈ లీక్‌డ్ వీడియోలో సీమ యాసలో విజయ్ అదరగొట్టేశాడు. చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఒరేయ్ *** నా కొడకా...యాడున్నవ్‌రా...మీ ఇళ్లలోకి వచ్చా...రా అబ్బా సంపుదువ్ గానీ అంటూ ఈ లీక్‌డ్ వీడియోలో విజయ్ రాయలసీమ స్లాంగ్‌లో డైలాగ్ చెప్పడం స్పష్టంగా వినిపిస్తుంది.
ఈ వీడియో చూస్తుంటే రణబాలిలో విజయ్ హీరోయిజం, ఎలివేషన్లు ఓ రేంజ్‌లో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. బండి నారాయణస్వామి రాసిన శప్తభూమి నవల ఆధారంగా రణబాలి సినిమా రూపొందుతోన్నట్లు సమాచారం.
హాలీవుడ్ నటుడు...
ఈ పాన్ ఇండియన్ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్ వోస్లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది.
Lights. Chaos. Elevation. 🔥
A leaked glimpse from the #RanaBaali sets hints at pure cinematic madness — and #VDK is all set to ignite MASS EUPHORIA on the big screen 💥
This isn’t just a film… it’s a storm coming your way ⚡️#VDK #Tollywood #MassRampage #CinemaMadness pic.twitter.com/koYuaeDuJ0
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) April 2, 2026
;
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



