త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | రెమ్యూనరేషన్‌లో స‌ల్మాన్‌ఖాన్‌ను దాటేసిన‌ న‌య‌న‌తార – బాలీవుడ్‌లో లేడీ సూప‌ర్ స్టార్ హ‌వా

స‌ల్మాన్ ఖాన్ హీరోగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ తెర‌క్కుతోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ బాలీవుడ్ మూవీ కోసం స‌ల్మాన్ ఖాన్ కంటే న‌య‌న‌తార ఎక్కువ‌గా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Apr 2, 2026, 8.20 am IST

Nayanthara | రెమ్యూనరేషన్‌లో స‌ల్మాన్‌ఖాన్‌ను దాటేసిన‌ న‌య‌న‌తార – బాలీవుడ్‌లో లేడీ సూప‌ర్ స్టార్ హ‌వా
Advertisement

Nayanthara | బాలీవుడ్‌, టాలీవుడ్ అనే తేడాలు లేకుండా ఎక్క‌డైనా రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో హీరోలదే పైచేయిగా ఉంటుంది. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు స్టార్ హీరోలు వంద‌ల కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్లు తీసుకుంటున్నారు. పారితోషికం విష‌యంలో హీరోల త‌ర్వాత ప్లేస్‌లోనే హీరోయిన్లు ఉండ‌టం ఆన‌వాయితీ. కానీ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌నతార మాత్రం ఈ రూల్‌ను తిర‌గ‌రాసింది. బాలీవుడ్ సినిమాలో రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ఏకంగా స‌ల్మాన్‌ఖాన్‌ను దాటేసింది.

వంశీపైడిప‌ల్లి డైరెక్ట‌ర్‌....

స‌ల్మాన్ ఖాన్ హీరోగా వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీని దిల్‌రాజు నిర్మించ‌బోతున్నారు. ఇటీవ‌లే ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఇందులో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.
ఈ నెల‌లోనే స‌ల్మాన్‌ఖాన్‌, వంశీపైడిప‌ల్లి మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

లాభాల్లో వాటా...

కాగా ఈ బాలీవుడ్ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ కంటే న‌య‌న‌తార రెమ్యూన‌రేష‌న్ ఎక్కువ‌ట‌. ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా వంశీపైడిప‌ల్లి సినిమాలో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్నాడ‌ట‌. ప్రాఫిట్‌లో షేర్ విధానంలో ఈ సినిమాను అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్ బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. 2017 నుంచి గ‌త ఏడాది రిలీజైన సికింద‌ర్ వ‌ర‌కు స‌ల్మాన్ ఖాన్ తొమ్మిది సినిమాలు చేయ‌గా...అందులో రెండు మాత్ర‌మే హిట్ట‌య్యాయి. మిగిలిన ఏడు సినిమాలు నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చాయి. ఈ డిజాస్ట‌ర్స్ కార‌ణంగా రెమ్యూన‌రేష‌న్ లేకుండా లాభాల్లో వాటా తీసుకునే విధానంలో సినిమా చేస్తాన‌ని దిల్‌రాజుకు స‌ల్మాన్ ఖాన్ మాట ఇచ్చార‌ట‌. సినిమా హిట్ట‌యితేనే స‌ల్మాన్ ఖాన్‌కు రెమ్యూన‌రేష‌న్ వ‌స్తుంది. రిజ‌ల్ట్ ఏ మాత్రం అటు ఇటు అయినా ఒక్క రూపాయి కూడా ద‌క్క‌దు.

న‌య‌న్ కు ప‌ది కోట్లు...

కాగా ఈ బాలీవుడ్ మూవీ కోసం న‌య‌న్ మాత్రం 10 కోట్లు రెమ్యూన‌రేష‌న్ అందుకోనున్న‌ట్లు చెబుతున్నారు. రెమ్యూన‌రేష‌న్ ప‌రంగా ఈ సినిమాలో న‌య‌న్ హ‌య్యెస్ట్ అని టాక్ వినిపిస్తోంది. షారుఖ్‌ఖాన్ జ‌వాన్ త‌ర్వాత హిందీలో న‌య‌న‌తార చేస్తోన్న సెకండ్ మూవీ ఇది. ఇందులోఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో అనిల్ క‌పూర్‌, అర‌వింద్ స్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 2027లో స‌ల్మాన్ ఖాన్‌, న‌య‌న‌తార మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement