త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | “విశ్వంభ‌ర” మ‌రోసారి వాయిదా – త్రిష కెరీర్‌లో రిలీజ్‌కు ఎక్కువ రోజులు టైమ్ ప‌ట్టిన సినిమా ఇదే

విశ్వంభ‌ర‌..కాకా సినిమాల్లో సంక్రాంతికి రిలీజ‌య్యే చిరంజీవి మూవీ ఏద‌న్న‌ది అభిమానుల్లో గ‌త కొద్ది రోజులుగా ఆస‌క్తిక‌రంగా మారింది. ఎట్ట‌కేల‌కు ఈ స‌స్పెన్స్ వీడిన‌ట్లు స‌మాచారం. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన విశ్వంభ‌ర‌కు మ‌రోసారి నిరాశే ఎదురైన‌ట్లు చెబుతోన్నారు.

N

Entertainment | Published On Nov 28, 2026, 2.58 pm IST

Trisha | “విశ్వంభ‌ర” మ‌రోసారి వాయిదా – త్రిష కెరీర్‌లో రిలీజ్‌కు ఎక్కువ రోజులు టైమ్ ప‌ట్టిన సినిమా ఇదే
Advertisement

Trisha |  చిరంజీవి విశ్వంభ‌ర మ‌రోసారి వాయిదాప‌డిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతికి కాకా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మెగాస్టార్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో విశ్వంభ‌ర పండుగ రేసు నుంచి త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

2023లో షూటింగ్ షురూ...

విశ్వంభ‌ర షూటింగ్ 2023లో మొద‌లైంది. సోషియో ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో త్రిష హీరోయిన్‌గా న‌టించింది. ఆషికా రంగ‌నాథ్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. 2025 సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ సీన్ల‌పై దారుణంగా విమ‌ర్శ‌లు రావ‌డంతో వాటి బెట‌ర్‌మెంట్ కోసం వాయిదావేశారు. హాలీవుడ్ స్టూడియోల‌తో క‌లిసి వీఎఫ్ఎక్స్ సీన్ల‌ను రీవ‌ర్క్ చేశారు. కొన్ని రీ షూట్స్ కూడా జ‌రిగాయి.

పండుగ రేసులో...

పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొత్తం కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కు ఈ భారీ బ‌డ్జెట్ మూవీ సిద్ధంగా ఉంది. కానీ స‌రైన విడుద‌ల తేదీ మాత్రం మేక‌ర్స్‌కు దొర‌క‌డం లేదు. సంక్రాంతికి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తే బెట‌ర్ అని నిర్మాత‌లు భావించారు. కానీ పండుగ రేసులో చిరంజీవి మ‌రో మూవీ కాకా కూడా నిల‌వ‌డం విశ్వంభ‌ర‌కు అడ్డంకిగా మారింది. ఈ రెండింటిలో సంక్రాంతి  ప్రేఓకుల ముందుకు వచ్చే మెగాస్టార్‌ మూవీ ఏద‌న్న‌ది గ‌త కొద్ది రోజుల్లో అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాకా రిలీజ్‌...

ఎట్ట‌కేల‌కు ఈ స‌స్పెన్స్ వీడిన‌ట్లు స‌మాచారం. ఇరు సినిమాల నిర్మాత‌ల‌తో శ‌నివారం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా స‌మావేశ‌మైన‌ట్లు తెలిసింది. ఈ మీటింగ్‌లో కాకాను సంక్రాంతికి రిలీజ్ చేసి విశ్వంభ‌ర‌ను పోస్ట్‌పోన్ చేయాల‌ని మెగాస్టార్ సూచించిన‌ట్లు స‌మాచారం.
ఈ సోషియో ఫాంట‌సీ మూవీ మ‌రోసారి వాయిదాప‌డ‌టం టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చిరంజీవితో పాటు హీరోయిన్ త్రిష కెరీర్‌లో షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కోసం ఎక్కువ రోజులు టైమ్ తీసుకున్న సినిమాగా విశ్వంభ‌ర నిలవబోతుంది.  కాకా సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అన‌స్వ‌ర రాజ‌న్‌, నివేదా పేతురాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో చిరంజీవి కామ‌న్‌మ్యాన్‌గా, గ్యాంగ్‌స్ట‌ర్‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

 

Advertisement
Advertisement