త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nana Patekar | నానా ప‌టేక‌ర్ మృతి.. అస‌హ‌జ మ‌ర‌ణంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు

Nana Patekar | బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా పటేక‌ర్ (Nana Patekar) మృతిచెందిన విష‌యం తెలిసిందే. అయితే, గోవా పోలీసులు (Goa Police) అస‌హ‌జ‌మ‌ర‌ణం (Unnatural Death) కింద కేసు న‌మోదు చేశారు. భార‌తీయ నాగ‌రిక సుర‌క్షా సంహితలోని 194వ సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు ప‌నాజీ పోలీసులు వెల్ల‌డించారు.

D

Entertainment | Published On Oct 9, 2026, 12.46 pm IST

Nana Patekar | నానా ప‌టేక‌ర్ మృతి.. అస‌హ‌జ మ‌ర‌ణంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు
Advertisement

Nana Patekar | త్రినేత్ర న్యూస్ : బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, ప్ర‌ముఖ నిర్మాత నానా పటేక‌ర్ (Nana Patekar) మృతిచెందిన విష‌యం తెలిసిందే. గురువారం ఉద‌యం గోవాలోని డోనా పౌలాలో ఉన్న త‌న నివాసంలో ఆయ‌న క‌న్నుమూశారు. అయితే, గోవా పోలీసులు అస‌హ‌జ‌మ‌ర‌ణం (Unnatural Death) కింద కేసు న‌మోదు చేశారు. భార‌తీయ నాగ‌రిక సుర‌క్షా సంహితలోని 194వ సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు ప‌నాజీ పోలీసులు వెల్ల‌డించారు. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పేర్కొ న్నారు. మ‌రోవైపు నానా ప‌టేక‌ర్ అంత్య‌క్రియ‌లు గురువారం అర్ధ‌రాత్రి నిర్వ‌హించారు. పుణెలో ఉన్న డోంజే ఫార్మ్‌హౌజ్‌లో నానా ప‌టేక‌ర్ పార్దీవ‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

గురువారం ఉద‌యం గోవాలోని డోనా పౌలాలో ఉన్న త‌న నివాసంలో నానాప‌టేక‌ర్‌ను అప‌స్మార‌క స్థితిలో గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. కాపాడేందుకు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ (CPR) చేసిన‌ప్ప‌టికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉద‌యం 5.20 గంట‌ల స‌మ‌యంలో మృతిచెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు.

Also Read..

న‌వ‌రాత్రి వేళ జెన్ జీ యువ‌త కొత్త ట్రెండ్‌.. గ‌ర్భా వేడుక‌ల్లో అల‌సిపోకుండా ఉండేందుకు ఐవీ డ్రిప్ థెరపీ

అవినీతి కేసు.. కేర‌ళ మాజీ సీఎం విజ‌య‌న్‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశించిన హైకోర్టు

Advertisement
Advertisement