త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nana Patekar | కార్గిల్ యుద్ధంలో పోరాడిన నానా ప‌టేక‌ర్ – షూటింగ్‌లో నేష‌న‌ల్ మెడ‌ల్స్‌

వెండితెర‌పైనే కాకుండా రియ‌ల్‌లైఫ్‌లో హీరోగా అభిమానుల చేత ప్ర‌శంస‌లు అందుకున్నారు నానా ప‌టేక‌ర్‌. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న నానా ప‌టేక‌ర్ భార‌త సైన్యంతో క‌లిసి అర‌వై రోజుల పాటు ప‌నిచేశారు. నేష‌న‌ల్ షూటింగ్‌లో రెండు మెడ‌ల్స్ సాధించారు.

N

Entertainment | Published On Oct 8, 2026, 4.53 pm IST

Nana Patekar |  కార్గిల్ యుద్ధంలో  పోరాడిన నానా ప‌టేక‌ర్  –  షూటింగ్‌లో నేష‌న‌ల్ మెడ‌ల్స్‌
Advertisement

Nana Patekar |  బాలీవుడ్‌లో బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు నానా ప‌టేక‌ర్‌. కేవ‌లం న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా, సింగ‌ర్‌గా ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. వెండితెర‌పైనే కాకుండా నిజ‌జీవితంలో హీరోగా అభిమానుల చేత ప్ర‌శంస‌లు అందుకున్నారు. 1999లో కార్గిల్ యుద్ధంలో అర‌వై రోజుల పాటు పాల్గొన్నారు నానా ప‌టేక‌ర్‌. ఈ విష‌యాన్నిఆయ‌నే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అంతే కాకుండా నేష‌న‌ల్ షూటింగ్ గేమ్స్‌లో పాల్గొన్న ఈ బాలీవుడ్ నటుడు రెండు ప‌త‌కాలు సాధించారు.

కార్గిల్ యుద్ధంలో...

కార్గిల్ యుద్ధ స‌మ‌యంలో దేశానికి తనవంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో నానా ప‌టేక‌ర్ ఆర్మీలో చేరాల‌ని అనుకున్నారు. కానీ సాధార‌ణ పౌరుడు అయిన నానా ప‌టేక‌ర్‌ ఆర్మీలో చేర‌డానికి కుద‌ర‌దంటూ అప్ప‌టి రక్షణ శాఖ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్ అడ్డుచెప్పారు. తాను కమాండో కోర్సు చేసిన సంగ‌తితో పాటు ఆయుధాలను ఉపయోగించడంలో త‌న‌కు ఉన్న నైపుణ్యాన్ని ఫెర్నాండెజ్‌కు వివరించారు నానా ప‌టేక‌ర్ . నేష‌న‌ల్‌ రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొని ప‌త‌కాలు సాధించిన‌ట్లు చెప్పారు. దాంతో నానా ప‌టేక‌ర్‌కు ఆర్మీలో చేరే అవ‌కాశాన్ని మినిస్ట‌ర్ క‌ల్పించారు. యుద్ధ స‌మ‌యంలో 60 రోజుల పాటు ఆర్మీతో కలిసి ఈ బాలీవుడ్ న‌టుడు ప‌నిచేశారు . ద్రాస్‌, లెహ్‌, కుప్వారా, బారాముల్లా, సొపొరీ తదితర ప్రాంతాల్లో భార‌తీయ సైన్యంతో క‌లిసి శ‌త్రువుల‌తో పోరాడారు. సైనికుడిగా నానా ప‌టేక‌ర్ చేసిన సేవ‌కు గాను హాన‌ర‌రీ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్‌తో ఇండియ‌న్ ఆర్మీ ఆయ‌న్ని గౌర‌వించింది.

నేష‌న‌ల్ షూటింగ్‌లో ఛాంపియ‌న్‌లో....

న‌ట‌న‌లోనే కాకుండా క్రీడ‌ల్లో నానా ప‌టేక‌ర్‌కు ప్రావీణ్య‌ముంది. ప్ర‌హార్ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో షూటింగ్ గేమ్‌పై ఈ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడికి ఇష్టం ఏర్ప‌డింది. 49 ఏళ్ల వ‌య‌సులో ప్రొఫెష‌న‌ల్ షూటింగ్‌లోకి అడుగుపెట్టారు నానా ప‌టేక‌ర్‌. 2004లో ఇండోర్‌లో జ‌రిగిన నేష‌న‌ల్ షూటింగ్ ఛాంపియ‌న్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. ఆ త‌ర్వాత 2007లో జ‌రిగిన జాతీయ పోటీల్లో మ‌హారాష్ట్రా టీమ్ త‌ర‌ఫున పాల్గొని కాంస్య ప‌తాకం సాధించారు నానా ప‌టేక‌ర్‌.

 

 

Advertisement
Advertisement