AICWA | నానా పటేకర్ మృతిపై తనుశ్రీ దత్తా వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతిపై నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నానా పటేకర్ మరణం నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో అభ్యంతరకర పదజాలంతో వ్యాఖ్యలు చేయడాన్ని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సురేశ్ శ్యామ్‌లాల్ గుప్తా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.
Entertainment | Published On Oct 9, 2026, 3.53 pm IST
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతిపై నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నానా పటేకర్ మరణం నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో అభ్యంతరకర పదజాలంతో వ్యాఖ్యలు చేయడాన్ని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సురేశ్ శ్యామ్‌లాల్ గుప్తా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.
కష్టాలు సహాయం అందించారని..
నానా పటేకర్ భారతీయ సినీ పరిశ్రమకు అందించిన సేవలను, సమాజం కోసం చేసిన కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఆయన.. తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకు సహాయం చేశారని తెలిపారు. కార్గిల్ యుద్ధ సమయంలోనూ సేవలందించారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి మరణంపై ఈ సమయంలో తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవి, సిగ్గుచేటని సంఘం మండిపడింది. మరణించిన వ్యక్తి గురించి ఇలాంటి పదజాలం ఉపయోగించడం మానవత్వానికి విరుద్ధమని పేర్కొంది. ఈ ఘటనపై నానా పటేకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధ్యతాయుతంగా మాట్లాడాలని తనుశ్రీ దత్తాకు సూచించింది.
ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా..
Lucknow, Uttar Pradesh: On the demise of veteran actor Nana Patekar, Actor Tanushree Dutta says, "First of all, I would like to thank Lucknow for welcoming and inviting me here. This is Snigdha ji, this is her event and Shiraz ji, for whom I have come for this event. Having said that, I have no reaction; today, my day is for them, for their event, to make their event a success. Now, what can I say? Whatever has passed, has passed"
— IANS (@ians_india) October 8, 2026
మరోవైపు, తన వ్యాఖ్యలపై స్పందించిన తనుశ్రీ దత్తా.. గత ఐదేళ్లుగా మీటూ (MeToo) వివాదం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. తనపై వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి కేసును వెనక్కి తీసుకోలేదని వెల్లడించారు. కేసు ఉపసంహరించుకునేలా తనపై ఒత్తిడి తెచ్చారని, అయినప్పటికీ వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత తన కారు బ్రేకులు పనిచేయకుండా చేశారని, ప్రమాదానికి గురయ్యానని, ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డానని ఆరోపించారు. తాను ఎదుర్కొన్న పరిస్థితులను తన కోణంలో అర్థం చేసుకోవాలని, అలాంటి అనుభవాలు లేనివారికి తన బాధ అర్థం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు.
నానా పటేకర్ ఈ నెల 8న వేకువ జామున కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ఆయనను బతికించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని మణిపాల్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శేఖర్ సల్గావ్కర్ తెలిపారు. అనంతరం పుణెలోని ఆయన ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Mumbai, 8 October 2026
AICWA strongly condemns Tanushree Dutta's "Evil Dead" remark on the passing of legend Nana Patekar
The entire film industry and the whole country are in mourning at the passing of Nana Patekar, the Padma Shri awardee, the man who served the nation during the Kargil War, and the artist whose Naam Foundation stood by farmers' families in distress. We pay him our humble tributes and stand with his family in their hour of grief.
At such a time, Tanushree Dutta's statement on social media, in which she used the words "Evil Dead," is deeply objectionable, insensitive and shameful. AICWA strongly condemns it.
To use such words for a person after his death goes against basic humanity. Until today, no one in our film industry has made such a statement after someone's passing. You are the first, and we pray you will be the last. People in this industry know what to say on such an occasion and when to stay silent. You should have kept a check on your tongue.
You said that today is your work day, that you are going to Lucknow for a big event, and that your whole day is planned. Do your work; nobody asked you. Whether your event is in Lucknow or London, whether you focus or not, nobody is interested. On a day when the country is mourning the loss of a stalwart, speaking about your own event and your own plans reflects a very small mindset.
We pray for the peace of Nana Patekar's soul.
Er. Suresh Shyamlal Gupta
President
AICWA| #NanaPatekar | #AICWA | #AllIndianCineWorkersAssociation |
| @nanagpatekar | @ANI | @PTI_News | @ians_india |
— All Indian Cine Workers Association (@aicwaofficial) October 8, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!





