త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IV Drip Therapy | న‌వ‌రాత్రి వేళ జెన్ జీ యువ‌త కొత్త ట్రెండ్‌.. గ‌ర్భా వేడుక‌ల్లో అల‌సిపోకుండా ఉండేందుకు ఐవీ డ్రిప్ థెరపీ

IV Drip Therapy | నవరాత్రి (Navratri) సంద‌ర్భంగా జెన్ జీ యువ‌త స‌రికొత్త ట్రెండ్‌కు తెర‌లేపింది. తొమ్మిది రోజుల పాటు జరిగే గర్బా, దాండియా నృత్య వేడుకల్లో అలసిపోకుండా ఉండటంతోపాటూ ముఖంలో గ్లో పెంచుకోవడానికి యువతీ యువకులు ఐవీ డ్రిప్ థెరపీ (IV Drip Therapy) కోసం క్యూ క‌డుతున్నారు.

D

National | Published On Oct 9, 2026, 11.54 am IST

IV Drip Therapy | న‌వ‌రాత్రి వేళ జెన్ జీ యువ‌త కొత్త ట్రెండ్‌.. గ‌ర్భా వేడుక‌ల్లో అల‌సిపోకుండా ఉండేందుకు ఐవీ డ్రిప్ థెరపీ
Advertisement

IV Drip Therapy | త్రినేత్ర న్యూస్ : పండుగ‌లు, పెళ్లిళ్లు వంటి ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో యువ‌తులు సెలూన్ల‌కు వెళ్ల‌డం సాధార‌ణంగా చూస్తుంటాం. ముఖం అందంగా మెర‌వ‌డానికి ఫేస్‌ప్యాక్‌లు, క్లీన‌ప్‌లు చేయించుకుంటుంటారు. అయితే, గుజరాత్‌లో నవరాత్రి సంద‌ర్భంగా జెన్ జీ యువ‌త స‌రికొత్త ట్రెండ్‌కు తెర‌లేపింది. తొమ్మిది రోజుల పాటు జరిగే గర్బా, దాండియా నృత్య వేడుకల్లో అలసిపోకుండా ఉండటంతోపాటూ ముఖంలో గ్లో (skincare packages) పెంచుకోవడానికి యువతీ యువకులు ఐవీ డ్రిప్ థెరపీ (IV Drip Therapy) కోసం క్యూ క‌డుతున్నారు.

న‌వ‌రాత్రులు అంటే అంద‌రికీ ముందుగా గుర్తొచ్చేది దాండియా, గ‌ర్భా నృత్యాలే. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద వాళ్ల వ‌ర‌కూ అంతా ఒక‌చోట చేరి రాత్రిపూట నృత్యాలు చేస్తూ సంద‌డిగా గ‌డుపుతుంటారు. ఈ నృత్యాల‌కు గుజ‌రాత్ రాష్ట్రం ఫేమ‌స్‌. ఏటా అహ్మదాబాద్‌లో నవరాత్రి గర్బా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్ర‌స్తుతం అక్క‌డ న‌వ‌రాత్రి సంద‌డి మొదలైపోయింది. ఈ నేప‌థ్యంలో రాత్రంతా డ్యాన్స్ చేయడం వల్ల ఎనర్జీ తగ్గిపోకుండా ఉండటానికి, చ‌ర్మం కాంతివంతంగా మెర‌వ‌డానికి జెన్-జీ యువత సెలూన్లు, క్లినిక్‌ల బాట పడుతున్నారు. విట‌మిన్ సి, బి-కాంప్లెక్స్‌, జింక్‌, గ్లూటాథియోన్ వంటి మల్టీవిటమిన్లతో కూడిన వెల్‌నెస్ కాక్‌టెయిల్ ఇన్‌ఫ్యూష‌న్‌ల‌ను (Infusion) ఆశ్ర‌యిస్తున్నారు.

వెల్‌నెస్ క్లినిక్స్‌కు భారీ డిమాండ్‌

అహ్మదాబాద్ (Ahmedabad)లోని డెర్మటాలజీ, వెల్‌నెస్ క్లినిక్‌లు ఈ ఐవీ డ్రిప్స్ కోసం బుకింగ్స్‌తో పూర్తిగా నిండిపోయాయి. కేవ‌లం అమ్మాయిలే కాదు, గ‌ర్భా నైట్ (garba nights)లో మెరిసిపోవ‌డానికి భారీ సంఖ్య‌లో యువ‌కులు కూడా ఈ థెర‌పీని ఎంచుకుంటున్నారు. జెన్‌జీతోపాటూ 40 ఏళ్ల వయస్సున్న ఉద్యోగులు కూడా ఐవీ డ్రిప్స్ థెర‌పీ కోసం బుక్ చేసుకుంటుండ‌టం విశేషం. నోటి ద్వారా తీసుకునే సప్లిమెంట్ల కంటే.. నేరుగా రక్తనాళాల ద్వారా శ‌రీరంలోకి ఈ డ్రిప్స్‌ను ఎక్కించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.

భారీగా ఖ‌ర్చు..

అంతేకాదు, ఈ థెర‌పీ కోసం వారు భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో ఈ ప్రత్యేకమైన ఐవీ డ్రిప్ సెషన్ల ధర ఒక్కో ట్రీట్‌మెంట్‌కు రూ. 4,000 నుంచి రూ. 10,000 వరకు ఉంటోంది. క్లినిక్, కాక్‌టెయిల్ ఫార్ములాను బ‌ట్టి ఫెస్టివ‌ల్ ప్యాకేజీలు రూ. 12,000 నుంచి రూ. 15,000 వరకు ఉన్నాయి. సుదీర్ఘ కార్పొరేట్ పనివేళలు, అర్ధరాత్రి వరకు జరిగే గర్బా నృత్యాల మధ్య తీవ్ర అలసటను, శారీర‌క శ్ర‌మ‌ను తట్టుకోవడానికి యువ‌త ఈ ఇన్‌ఫ్యూషన్‌లను ఎంచుకుంటున్నారు.

రెండు రోజుల‌కే నీర‌స‌ప‌డిపోకుండా..

"ఆఫీస్ డెడ్‌లైన్లు, అర్ధరాత్రి గర్బా ప్రాక్టీస్‌లతో చర్మం పూర్తిగా నిర్జీవంగా మారిపోయింది. అందుకే న‌వ‌రాత్రుల్లో రెండు రోజుల‌కే నీర‌స‌ప‌డిపోకుండా గ్రౌండ్‌లో ఎనర్జీగా ఉండటానికి, ఫోటోల్లో చర్మం కాంతివంతంగా, ఫ్రెష్‌గా కనిపించడానికి మా గర్బా గ్రూప్ ఫ్రెండ్స్ అందరం కలిసి నవరాత్రుల ముందే ఒక గ్లో డ్రిప్ సెషన్ తీసుకున్నాము" అని ఓ స్థానిక యువ‌తి తెలిపారు.

నిపుణుల హెచ్చ‌రిక‌లు..

అయితే, జెన్ జీ యువ‌త ఆశ్ర‌యిస్తున్న ఈ ప‌ద్ధ‌తుల‌పై వైద్య నిపుణులు తీవ్ర హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. కేవ‌లం గ్లో, ఎన‌ర్జీ కోసం నేరుగా న‌రాల్లోకి (Intravenous) ఇలాంటి డ్రిప్స్ ఎక్కించుకోవ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెబుతున్నారు. దీనివ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. న‌వ‌రాత్రుల్లో ఉత్సాహంగా, అందంగా ఉండ‌టానికి మంచి నిద్ర‌, స‌రైన ఆహారం, శ‌రీరానికి త‌గినంత నీరు (Hydration) తీసుకోవడమే అన్నింటిక‌న్నా ఉత్త‌మ‌మైన మార్గ‌మ‌ని సూచిస్తున్నారు.

Also Read..

డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌

ప్ర‌జాస్వామ్యానికి వెన్నెముక ఎన్నిక‌ల సంఘం.. అది అధికారంలో ఉన్న‌వారికి ర‌క్ష‌ణ క‌వ‌చం కావొద్దు: హ‌రీశ్ రావు

అవినీతి కేసు.. కేర‌ళ మాజీ సీఎం విజ‌య‌న్‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశించిన హైకోర్టు

Advertisement
Advertisement