Gaddar Awards | ఉత్తమ నటుడు నాగచైతన్య.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
Gaddar Awards | త్రినేత్ర.న్యూస్: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్- 2025 (Gaddar Awards) విజేతలను ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)) పొందిన చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. తండేల్ చిత్రంలో నటనకుగాను బెస్ట్ యాక్టర్‌గా నాగచైతన్యను ఎంపికయ్యారు.
Entertainment | Published On Mar 7, 2026, 12.11 pm IST
Gaddar Awards | త్రినేత్ర.న్యూస్: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్- 2025 (Gaddar Awards) విజేతలను ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ((CBFC)) పొందిన చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. తండేల్ చిత్రంలో నటనకుగాను బెస్ట్ యాక్టర్‌గా నాగచైతన్యను ఎంపికయ్యారు. లోకనాయకుడు కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డుతో సంత్కరించనున్నారు. అదేవిధంగా అగ్ర నటుడు చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారం వరించింది. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను సినారే అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. మార్చి 19 ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది.
గద్దర్ అవార్డులు 2025..
- ఉత్తమ నటుడు- నాగ చైతన్య (తండేల్)
- ఉత్తమ నటి- రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
- ఉత్తమ చిత్రం- రాజు వెడ్స్ రాంబాయి
- ఉత్తమ ద్వితీయ చిత్రం- దండోరా
- ఉత్తమ తృతీయ చిత్రం- ది ప్రీ వెడ్డింగ్ షో
- నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా- తండేల్
- ఉత్తమ పర్యావరణ చిత్రం - ఇగ్వా
- ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్- లిటిల్ హార్డ్స్
- ఉత్తమ వినోదాత్మక చిత్రం- సంక్రాంతికి వస్తున్నాం
- ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం- కోర్టు
- ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ- మిరాయ్
- ఉత్తమ బాలల చిత్రం- అనగనగనా
- ఉత్తమ దర్శకుడు- సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ సహాయ నటుడు- శివాజీ
- ఉత్తమ సహాయ నటి- భూమిక
- ఉత్తమ సంగీత దర్శకుడు- మార్క్ కె రాబిన్ (దండోరా)
- ఉత్తమ నేపథ్య గాయకుడు- అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ నేపథ్య గాయని- సాహితి చాగంటి (కన్నప్ప)
- ఉత్తమ హాస్యనటుడు- కృష్ణ తేజ (జిగ్రీస్)
- ఉత్తమ బాలనటుడు- రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
- ఉత్తమ కథా రచయిత- గుణశేఖర్ (యుఫోరియా)
- ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్- అనిల్ రావిపూడి
- ఉత్తమ గేయ రచయిత- నందకిశోర్ (కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్- కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
- ఉత్తమ ఆడియోగ్రాఫర్- ఎంఆర్. రాధాకృష్ణన్ (కిష్కిందపురి)
- ఉత్తమ కొరియోగ్రాఫర్- గిర గిర గిర (చాంపియన్)
- ఉత్తమ ఆర్ట్ డైరక్టర్- తోట తరణి (చాంపియన్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్- గోవింద్ అఖండ
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్- చంద్రకాంత్ (చాంపియన్)
- ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్- 23
- ఉత్తమ మేల్ యాక్టర్ - చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ నటి - అనంతిక (8 వసంతాలు)
- స్పెషల్ జ్యూరీ హీరో - రోషన్ (చాంపియన్)
గౌరవ పురస్కారాలు..
- పైడి జయరాజ్ అవార్డు- కమల్ హాసన్
- ఎన్టీఆర్ అవార్డు- మెగాస్టార్ చిరంజీవి
- ఏఎన్ఆర్ అవార్డు- జయసుధ
- కాంతారావు అవార్డు- ఆర్. నారాయణమూర్తి
- బీఎన్ రెడ్డి అవార్డు- సింగీతం శ్రీనివాసరావు
ఇవికూడా చదవండి
అచ్చిరాని నరేంద్ర మోదీ స్టేడియం.. టీమిండియా గెలవాలని అభిమానుల పూజలు..
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



