Flipkart | ఉద్యోగులకు షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్.. 300 మందిపై వేటు..!
Flipkart | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ఉద్యోగులకు (employees) షాకిచ్చింది. వార్షిక పనితీరు సమీక్ష పేరు (annual performance review)తో భారీగా లేఆఫ్స్ (Layoffs) ప్రకటించింది.
Flipkart | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ఉద్యోగులకు (employees) షాకిచ్చింది. వార్షిక పనితీరు సమీక్ష పేరు (annual performance review)తో భారీగా లేఆఫ్స్ (Layoffs) ప్రకటించింది. సుమారు 300 మందిపై వేటు వేసింది. లేఆఫ్స్ ప్రభావం సంస్థలోని వివిధ విభాగాలు, స్థాయిల్లోని ఉద్యోగులపై పడినట్లు సమాచారం. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ సంస్థ.. త్వరలో భారత్‌లో స్టాక్ మార్కెట్ లిస్టింగ్ (IPO) కు సిద్ధమవుతున్న తరుణంలో అంతర్గత ప్రక్రియలను క్రమబద్ధీకరించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ లేఆఫ్స్‌పై ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం స్పందించింది. ఉద్యోగుల పనితీరును తాము క్రమం తప్పకుండా సమీక్షిస్తామని వెల్లడించింది. నిర్దేశిత అంచనాలను అందుకోలేని కొద్ది శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలగాల్సి వస్తుందని పేర్కొంది. ఇది ఏటా జరిగే సాధారణ ప్రక్రియలో భాగమేనని తెలిపింది. అయితే ఎంత మందిని తొలగించారన్న విషయాన్ని మాత్రం ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. లేఆఫ్స్‌కు గురైన వారి సంఖ్య 300 కంటే ఎక్కువగానే ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ తర్వలోనే ఐపీవోకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సింగపూర్‌లో ఉన్న తన ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కు మార్చింది. భారత నియంత్రణ సంస్థల నిబంధనలకు అనుగుణంగా కంపెనీ తన హోల్డింగ్ నిర్మాణంలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. ఫ్లిప్‌కార్ట్లో మొత్తం 20 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఓ వైపు ఐపీఓ కోసం సన్నాహాలు చేస్తూ, మరోవైపు సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో నియామకాలు జరుపుతున్న ఫ్లిప్ కార్ట్.. అదే సమయంలో ఉద్యోగులను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఫ్లిప్ కార్ట్ 2024లో కూడా దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
Also Read..
Tehran airport | టెహ్రాన్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. ఎగసిపడ్డ మంటలు
Puri Jagannath Temple | పూరీ జగన్నాథుడి సేవలో నాగచైతన్య, శోభిత జంట
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం






