Meenakshi Chaudhary | కంఫర్ట్ జోన్ దాటి చేసిన సినిమా – “వృషకర్మ”తో ఆ భయాలు పోయాయి – మీనాక్షి చౌదరి కామెంట్స్
వృషకర్మ సీక్వెల్‌పై హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర కామెంట్లు చేసింది. ఈ హారర్ మూవీలో తన పాత్రతో పాటు సినిమాను అంగీకరించడానికి గల కారణాలను వివరించింది. కొత్త తరహా పాత్రలకే తన ప్రాధాన్యత అని చెప్పింది మీనాక్షి చౌదరి.
Entertainment | Published On Nov 27, 2026, 7.03 pm IST
"నటిగా నా కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చే క్యారెక్టర్లు చేయాలనుంది. ఒకే తరహా పాత్రలు చేయడం నచ్చదు" అని అన్నది మీనాక్షి చౌదరి. ఆమె హీరోయిన్‌గా నటించిన వృషకర్మ మూవీ డిసెంబర్ 4న థియేటర్లలోకి రాబోతుంది. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. వృషకర్మ గురించి మీనాక్షి చౌదరి చెప్పిన ముచ్చట్లివి...
దక్ష క్యారెక్టర్
డైరెక్టర్ కార్తిక్ దక్ష క్యారెక్టర్ అనుకున్నప్పుడే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను డిజైన్ చేశారు. కథ చెప్తున్నప్పుడు కూడా ఈ క్యారెక్టర్‌ను ఎలా చేయాలి అనే విషయంపై చాలా ఆలోచనలు చేశాం. ఆ రీసెర్చ్ కారణంగా ఈ పాత్రకు దర్శకుడు నన్ను ఎందుకు ఎంపిక చేశారనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. దక్ష చాలా ఫోకస్‌డ్‌గా ఉండే అమ్మాయి. తనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. తను ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంది. ఈ పాత్ర ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
రెండు రోజులు వర్క్‌షాప్...
కథ చెప్పిన తర్వాత హీరో నాగచైతన్యతో కలిసి రెండు రోజులు వర్క్‌షాప్ చేశాం. డైరెక్టర్ విజన్ ఏంటి? దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? అనే విషయాలపై ఓ అవగాహనకు వచ్చాం. వర్క్‌షాప్‌లో చాలా విషయాలపై రిహార్సల్స్ జరిగాయి. అలాగే ఆర్కియాలజీ గురించి చాలా లోతైన విషయాలు కూడా నేర్చుకున్నాను.
విజువలైజేషన్
వృషకర్మ’ కోసం దర్శకుడు క్రియేట్ చేసిన ప్రపంచం చాలా కొత్తగా ఉంటుంది. హారర్, మిథికల్ జానర్‌లో గతంలో చాలానే సినిమాలు వచ్చినప్పటికీ ‘వృషకర్మ’ వాటికి భిన్నంగా ఉంటుంది. విజువలైజేషన్, ట్రీట్‌మెంట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి.
ఎత్తైన ప్రదేశాలంటే...
నాకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయం. ఇందులో అలాంటి సీక్వెన్సులు ఉన్నాయి. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకొని పూర్తిచేశా. అలాగే చిన్నతనంలో హారర్ సినిమాలు చూస్తానంటే కుటుంబసభ్యులు ఒప్పుకునేవారు కాదు. పీడకలలు వస్తాయని భయపెట్టేవారు. పెద్దయ్యాక హారర్ నా ఫేవరేట్ జానర్‌గా మారింది. వృషకర్మను అంగీకరించడానికి అది కూడా ఒక కారణం. థ్రిల్లర్, డిటెక్టివ్ సినిమాలు చేయాలనుంది.
వైవిధ్యమైన పాత్రలు..
ఒక నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయడంపైనే నా దృష్టి ఉంది. నటిగా కొత్త క్యారెక్టర్స్‌లో నన్ను నేను ఆవిష్కరించుకునేందుకే ప్రయత్నిస్తున్నా. ఒకే తరహా పాత్రలు, జానర్స్ వస్తే వాటిని చేయను. ‘లక్కీ భాస్కర్’ చూసిన తర్వాత చాలామంది మదర్ రోల్స్ ఆఫర్ చేశారు. వాటికి నేను అంగీకరించలేదు. ఎందుకంటే ఆల్రెడీ అలాంటి క్యారెక్టర్ చేశాను. కథ, పాత్ర కొత్తగా ఉన్నప్పుడే చేయాలని అనిపిస్తుంది. అలాగే నా కంఫర్ట్ జోన్ దాటి బయటికి వచ్చి కూడా క్యారెక్టర్స్ చేయాలని ఉంది.
‘
నెట్‌ఫ్లిక్స్‌లో...
‘వృషకర్మ’ పార్ట్ 2పై మీనాక్షి చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సీక్వెల్ ఉంటుందా? లేదా? అన్నది డిసెంబర్ 4న తెలుస్తుందని చెప్పింది. తమిళ హీరో కార్తితో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నా. నా పాత్రకు సంబంధించిన పోర్షన్ 60 శాతం పూర్తయింది. హిందీ, తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలో చేస్తున్నాను. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌సిరీస్ అంగీకరించా.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..






