Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్
Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Incident)పై నాంపల్లి కోర్టులో (Nampally Court) ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) వర్చువల్‌గా హాజరయ్యారు.
Entertainment | Published On Jul 6, 2026, 1.46 pm IST
Allu Arjun | త్రినేత్ర.న్యూస్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Incident)పై నాంపల్లి కోర్టులో (Nampally Court) ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) వర్చువల్‌గా హాజరయ్యారు. షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ముంబైలో ఉన్న అల్లు అర్జున్‌కు వర్చువల్‌గా అటెండ్ అయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే, ఈ కేసులో నిందితులుగా ఉన్న కొంతమంది విచారణకు హాజరుకాకపోవడంతో.. తదుపరి విచారణను కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది.
2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. థియేటర్ యజమాని, సిబ్బందితోపాటు అల్లు అర్జున్‌ను కూడా నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా, ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 23 మంది నిందితులపై పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. గత విచారణలకు సైతం అల్లు అర్జున్ వర్చువల్‌గానే హాజరయ్యారు. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, సినిమా షూటింగ్స్ నిమిత్తం ప్రస్తుతం ముంబైలో ఉన్న బన్నీ.. కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read..
నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..
సంబంధిత వార్తలు

Raja Singh | రాజాసింగ్‌కు బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు..!
జూన్ 30, 2026

Allu Sneha Reddy | నిర్మాతగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ – జోకర్ మూవీ లాంఛ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా స్నేహారెడ్డి
జూన్ 27, 2026

Rashmika Mandanna | పుష్పరాజ్‌తో మూడోసారి జోడీగా శ్రీవల్లి – “రాకా” లోకి నేషనల్ క్రష్ ఎంట్రీ ఎప్పుడంటే?
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Grace Antony | వాటే ట్రాన్స్ఫర్మేషన్ - బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా మారిన మలయాళ బ్యూటీ!
- ●Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్‌రెడ్డి
- ●Apple | మళ్లీ కార్డ్ పేమెంట్స్.. యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్..
- ●N. Ramchander Rao | కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాటకాలు వేస్తున్నాయి: రాంచందర్‌రావు
- ●Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి
- ●Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ

Grace Antony | వాటే ట్రాన్స్ఫర్మేషన్ - బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా మారిన మలయాళ బ్యూటీ!

Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్‌రెడ్డి

Apple | మళ్లీ కార్డ్ పేమెంట్స్.. యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్..

N. Ramchander Rao | కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాటకాలు వేస్తున్నాయి: రాంచందర్‌రావు



