Rashmika Mandanna | పుష్పరాజ్‌తో మూడోసారి జోడీగా శ్రీవల్లి – “రాకా” లోకి నేషనల్ క్రష్ ఎంట్రీ ఎప్పుడంటే?
అల్లు అర్జున్, రష్మిక మందన్న ముచ్చటగా మూడోసారి జోడీకట్టబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. ఆ సినిమా ఏదంటే?
Entertainment | Published On Jun 27, 2026, 3.45 pm IST
Rashmika Mandanna | టాలీవుడ్‌లో సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు అల్లు అర్జున్, రష్మిక మందన్న. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. ఈ సినిమాల్లో శ్రీవల్లిగా రష్మిక నటన, మ్యానరిజమ్స్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. బన్నీ రష్మిక కెమిస్ట్రీ కూడా ఈ విజయాల్లో కీలకంగా నిలిచింది.
మూడోసారి...
అల్లు అర్జున్, రష్మిక మందన్న ముచ్చటగా మూడోసారి జోడీ కట్టబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో తెలుగు మూవీ రాబోతుంది. బన్నీ హీరోగా కోలీవుడ్ సెన్సేషన్ అట్లీ డైరెక్షన్‌లో రాకా పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ రాబోతుంది. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీపికతో పాటు రాకాలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీకపూర్ కథానాయికలుగా కనిపించబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లపై మేకర్స్ మాత్రం రియాక్ట్ కాలేదు.
కన్ఫామ్...
తాజాగా రాకా మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటించడం కన్ఫామ్ అయ్యింది. త్వరలోనే ఈ పాన్ ఇండియన్ మూవీ సెట్స్‌లో నేషనల్ క్రష్ అడుగుపెట్టబోతుంది. జూలై సెకండ్ వీక్ నుంచి రాకా షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నదట రష్మిక. సైన్స్ ఫిక్షన్ మూవీలో రష్మిక రోల్ డిఫరెంట్‌గా ఉంటుందట. ఇప్పటివరకు తెలుగులో చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా రాకాలో ఆమెకు కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారట డైరెక్టర్ అట్లీ. హ్యూమర్, సూపర్ పవర్స్ కలబోసిన అమ్మాయిగా రష్మిక కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక నటించనున్న విషయాన్ని మేకర్స్ ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్ ద్వారా అఫీషియల్‌గా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
డిసెంబర్‌లో
రాకా మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా రాకా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
భర్తతో...
ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో భర్త విజయ్ దేవరకొండతో రణబాలి సినిమా చేస్తోంది. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైసా పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. రష్మిక హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2 ఇటీవలే రిలీజైంది. ఈ సినిమాలో గ్లామర్ రోల్‌లో రష్మిక కనిపించింది. వారం రోజుల్లోనే ఈ హిందీ మూవీ వంద కోట్ల వసూళ్లను దక్కించుకుంది.
సంబంధిత వార్తలు

Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ – పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్
జూన్ 27, 2026

Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష, తమన్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మల సందడి
జూన్ 27, 2026

Keerthy Suresh | భర్తతో కలిసి శ్రీకాళహస్తిలో కీర్తి సురేష్ ప్రత్యేక పూజలు – ఫొటోలు వైరల్
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం
- ●Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం
- ●Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?
- ●Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్
- ●Snake in Underwear | ఆ పని చేస్తుండగా.. అండర్వేర్లోకి దూరిన పాము.. వీడియో
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు హెచ్చరికలు..

TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం

Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం

Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?

Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్



