Allu Sneha Reddy | నిర్మాతగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ – జోకర్ మూవీ లాంఛ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా స్నేహారెడ్డి
అల్లు అర్జున్ స్నేహితుడు సందీప్ రామినేని నిర్మాతగా ఎంట్రీ ఇస్తోన్నారు. జోకర్ పేరుతో ఓ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించబోతున్నారు. శనివారం జోకర్ మూవీ ప్రారంభమైంది. ఈ లాంఛింగ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పాల్గొన్నది
Entertainment | Published On Jun 27, 2026, 7.46 pm IST
Allu Sneha Reddy అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ సందీప్ రామినేని (శాండి) నిర్మాతగా మారారు. తొలి ప్రయత్నంగా జోకర్ పేరుతో ఓ సినిమాను నిర్మించబోతున్నారు. న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మౌర్య సిద్ధవరం, తన్వీ ఆకాంక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గీత సీ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
అల్లు స్నేహారెడ్డి...
జోకర్ మూవీ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పాల్గొన్నది. ఆమెతో పాటు అల్లు అరవింద్, బన్నీవాస్ సహా పలువురు సినీ ప్రముఖులు ఓపెనింగ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా..అల్లు స్నేహ కెమెరా స్విఛాన్ చేశారు. బన్నీ వాస్ స్క్రిప్ట్‌ను అందించారు.
రెగ్యులర్ షూటింగ్...
ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా జోకర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు నిర్మాత సందీప్ చెప్పారు. ఆగస్ట్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. మౌర్య తన్వీ జోడి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందని అన్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
అల్లు అర్జున్ రావాల్సింది...కానీ...
జోకర్ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరుకావాల్సిందట. కానీ రాకా మూవీ షూటింగ్‌తో బిజీగా ఉండటంతో భర్త తరఫున అల్లు స్నేహారెడ్డి ఈ వేడుకకు అటెండ్ అయినట్లు చెబుతున్నారు. అల్లు స్నేహారెడ్డి సినిమా వేడుకల్లో పాల్గొనడం తక్కువే. జోకర్ మూవీ ఈవెంట్‌కు ఆమె అటెండ్ కావడం ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | పుష్పరాజ్‌తో మూడోసారి జోడీగా శ్రీవల్లి – “రాకా” లోకి నేషనల్ క్రష్ ఎంట్రీ ఎప్పుడంటే?
జూన్ 27, 2026

Priyadarshi | ప్రియదర్శి ఇడుపుకాయితం గ్రాండ్‌గా లాంఛ్ – టైటిల్ రివీల్ చేసిన లోకేష్ కనగరాజ్
జూన్ 25, 2026

Allu Arjun | కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
- ●Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...
- ●Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం
- ●Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో భారీ సభ నిర్వహిద్దాం : కల్వకుంట్ల కవిత
- ●KTR | ఆర్ఎస్పీకి భద్రత తగ్గించడం పూర్తిగా కక్ష సాధింపు చర్యే : కేటీఆర్
- ●TG RERA | తెలంగాణ 'రెరా' చైర్మన్‌గా కేఎస్ శ్రీనివాసరాజు నియామకం

CM Revanth Reddy | రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...

Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం

Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో భారీ సభ నిర్వహిద్దాం : కల్వకుంట్ల కవిత



