త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Singh | రాజాసింగ్‌కు బిగ్ రిలీఫ్‌.. కేసును కొట్టివేసిన నాంప‌ల్లి కోర్టు..!

Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును కోర్టు పూర్తిగా కొట్టి వేసింది. విచారణలో ఇరుపక్షాల వాద‌న‌లు విన్న న్యాయస్థానం.. రాజాసింగ్‌పై మోపిన అభియోగాలకు తగిన సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది.

P

Hyderabad | Published On Jun 30, 2026, 6.45 pm IST

Raja Singh | రాజాసింగ్‌కు బిగ్ రిలీఫ్‌.. కేసును కొట్టివేసిన నాంప‌ల్లి కోర్టు..!
Advertisement

Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును కోర్టు పూర్తిగా కొట్టి వేసింది. విచారణలో ఇరుపక్షాల వాద‌న‌లు విన్న న్యాయస్థానం.. రాజాసింగ్‌పై మోపిన అభియోగాలకు తగిన సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. దీంతో తుది తీర్పులో ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. కేసు వివ‌రాల్లోకి వెళితే.. 2022 ఆగస్టుకు చెందింది. అప్పట్లో హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో నిర్వహించడంపై రాజకీయంగా, సామాజికంగా పెద్ద దుమారం రేగింది. ఆ షోను తీవ్రంగా వ్యతిరేకించిన రాజాసింగ్, యూట్యూబ్‌లో ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలోని వ్యాఖ్యలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.

దీంతో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా మంగళ్‌హాట్ పోలీసులు భారత శిక్షాస్మృతిలోని 153ఏ, 295ఏ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2022 ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ, ఆ అరెస్ట్ ప్రక్రియలో నిబంధనలు సక్రమంగా పాటించలేదన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే కారణంతో స్థానిక కోర్టు రిమాండ్‌ను తిరస్కరించి, రాజాసింగ్‌ను అప్పటికప్పుడు విడుదల చేసింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. నగరంలో చోటుచేసుకున్న నిరసనలు, శాంతిభద్రతల సమస్యలను కారణంగా చూపుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆయనపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆ పరిణామాల నేపథ్యంలో రాజాసింగ్ దాదాపు 77 రోజుల పాటు జైలులో గడపాల్సి వచ్చింది. తాజాగా కోర్టు కేసును కొట్టివేసింది.

Advertisement
Advertisement