Janhvi Kapoor | పుట్టినరోజు సందర్భంగా.. వెంకన్న ఆశీస్సులు తీసుకున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి తనయ, బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirumala Srivari temple) దర్శించుకున్నారు.
Entertainment | Published On Mar 6, 2026, 2.00 pm IST
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి తనయ, బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirumala Srivari temple) దర్శించుకున్నారు. తన పిన్ని, నటి మహేశ్వరితో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న జాన్వీ కపూర్ ఇవాళ ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. బర్త్‌డే సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనం అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. ఇక శ్రీవారి దర్శనం సందర్భంగా జాన్వీ లంగా ఓనీలో మెరిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
https://x.com/ians_india/status/2029777555474239762
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు దైవభక్తి ఎక్కువ. ఖాళీ సమయం దొరుకుతే చాలు తిరుమలకు వెళ్తుంటుంది. ముఖ్యంగా పుట్టినరోజు, సినిమా రిలీజ్‌లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో వెంకన్న (Lord Venkateswara) ఆశీస్సుల కోసం తిరుమల కొండకు వెళ్తుంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి ఏడుకొండలవాడిని దర్శించుకుంటుంది. ఎప్పుడు తిరుమల వెళ్లినా జాన్వీ కపూర్ మెట్ల మార్గం ద్వారానే కొండపైకి వెళ్తుంటారు. ఈసారి కూడా అదే ఆనవాయితీని అనుసరించింది ఈ బీటౌన్ భామ.
ఎన్డీఆర్ ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi)లో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..
కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రకటించిన సీఎం
లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన నయనతార.. ధర తెలిస్తే షాకే..!
యుద్ధం ఎఫెక్ట్.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి..? పెరుగుతాయా..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | పల్లెటూరు అమ్మాయిలంటే చిన్నచూపా? – పెద్దిలో జాన్వీ రోల్‌పై నెటిజన్ల ఫైర్
మే 19, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



