Social Media | కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రకటించిన సీఎం
Social Media | కర్ణాటక ప్రభుత్వం (Karnataka Governament) కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా (Social Media) వినియోగంపై నిషేధం విధించింది.
Social Media | కర్ణాటక ప్రభుత్వం (Karnataka Governament) కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా (Social Media) వినియోగంపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రకటించారు. శుక్రవారం ఉదయం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం.. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతోందని.. మొబైల్ వినియోగం వలన కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. 16ఏళ్లలోపు పిల్లలు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయడం వలన కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం బేరీజు వేసిందని అన్నారు.
కాగా, దేశంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఏపీ, గోవా రాష్ట్రాలు కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కొన్ని ప్రపంచ దేశాలు ఇప్పటికే టీనేజర్లు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ను యువత వినియోగించకుండా గత డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించింది. పలు దేశాలు కూడా ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయి.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా టీనేజర్లు సోషల్ మీడియా వినియోగించుకుండా నిషేధించాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ మేరకు దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read..
లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన నయనతార.. ధర తెలిస్తే షాకే..!
ప్రతీ మహిళా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి : మంత్రి పొన్నం
99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలి: మంత్రి దామోదర
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026

X | ఫ్రీ యూజర్లకు షాకిచ్చిన ఎక్స్.. పోస్టులపై లిమిట్స్ విధింపు..
మే 18, 2026

Bandi Bhageerath | అందరిలాగే నా కూతురికీ రక్షణ, గౌరవం పొందే అర్హత ఉంది.. బండి భగీరథ్ బాధితురాలి తల్లి
మే 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



