Puri Jagannath Temple | పూరీ జగన్నాథుడి సేవలో నాగచైతన్య, శోభిత జంట
Puri Jagannath Temple | టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఒడిశా పూరీలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు.
Entertainment | Published On Mar 7, 2026, 9.39 am IST
Puri Jagannath Temple | టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఒడిశా పూరీలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. తన భార్య శోభిత (Sobhita Dhulipala)తో కలిసి శుక్రవారం రాత్రి జగన్నాథుడిని (Puri Jagannath Temple) దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చైతూ జంటకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
https://x.com/ANI/status/2030034432921587873
వృషకర్మలో..
సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమాలో (Vrushakarma Movie) నటిస్తున్నారు. తండేల్ సూపర్ హిట్ తర్వాత చైతూ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటీ నెలకొంది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో మలయాళ నటుడు జయరామ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్‌తో కలిసి సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
హాలీవుడ్ లెవెల్‌లో..
ఈ సినిమాలో అర్జున్‌గా స్టైలిష్ కమ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నాగచైతన్య కనిపించబోతున్నారు. ఈ మూవీ గ్లింప్స్‌ను గురువారం రిలీజ్ చేశారు. అతీంద్రియ శక్తిని అర్జున్ ఎలా ఎదురించాడు? అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. విజువల్స్, బీజీఎమ్, స్పెషల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
Also Read..
Allu Sirish Wedding Pics | అల్లు శిరీష్ పెళ్లి ఫొటోలు - హాజరైన అతిథులు వీళ్లే!
Hyderabad | చిల్ అవుదామని చిల్డ్ బీర్ కొంటే.. దర్శనమిచ్చిన చేప పిల్ల
సంబంధిత వార్తలు

ISKCON vs Puri Temple | ఇస్కాన్ వర్సెస్ పూరీ శ్రీమందిరం: విదేశాల్లో జగన్నాథుని రథయాత్ర తేదీలపై ఎందుకీ వివాదం?
జులై 11, 2026

Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జూన్ 20, 2026

Meenakshi Chaudhary | అభిమానులను అప్రమత్తం చేసిన మీనాక్షి చౌదరి.. అసలు ఏం జరిగిందంటే..?
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●TCS | టీసీఎస్ షేర్హోల్డర్లకు గుడ్ న్యూస్.. రూ.12 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ..
- ●Bhagyashri Borse | లెనిన్ సక్సెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే - హైదరాబాద్ నా కర్మభూమి అంటూ కామెంట్స్
- ●Venezuela | వెనెజువెలాలో 4,000 దాటిన భూకంపం మృతులు
- ●Heart Check Up | 35 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా హార్ట్ చెకప్ చేయించుకోవాలి.. కార్డియాలజిస్టు సూచన..
- ●Jagga Reddy | సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. వేరే దగ్గర చేయనని చెప్పలే
- ●King Cobra | మధురానగర్ పోలీసు స్టేషన్లో నాగుపాము పిల్లలు.. షాకైన ఖాకీలు

TCS | టీసీఎస్ షేర్హోల్డర్లకు గుడ్ న్యూస్.. రూ.12 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ..

Bhagyashri Borse | లెనిన్ సక్సెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే - హైదరాబాద్ నా కర్మభూమి అంటూ కామెంట్స్

Venezuela | వెనెజువెలాలో 4,000 దాటిన భూకంపం మృతులు

Heart Check Up | 35 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా హార్ట్ చెకప్ చేయించుకోవాలి.. కార్డియాలజిస్టు సూచన..



