TCS | టీసీఎస్ షేర్‌హోల్డర్లకు గుడ్ న్యూస్.. రూ.12 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ..
TCS | భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన షేర్‌హోల్డర్లకు ప్రతి ఈక్విటీ షేర్‌పై రూ.12 డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మార్కెట్ అంచనాల ప్రకారం డివిడెండ్ రూ.19 ఉండొచ్చని భావించినప్పటికీ, కంపెనీ రూ.12 డివిడెండ్‌ను ప్రకటించింది.
TCS | భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన షేర్‌హోల్డర్లకు ప్రతి ఈక్విటీ షేర్‌పై రూ.12 డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మార్కెట్ అంచనాల ప్రకారం డివిడెండ్ రూ.19 ఉండొచ్చని భావించినప్పటికీ, కంపెనీ రూ.12 డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌కు అర్హులైన షేర్‌హోల్డర్లను గుర్తించేందుకు రికార్డ్ డేట్‌ను జూలై 15గా నిర్ణయించింది. అర్హత పొందిన ఇన్వెస్టర్లకు జూలై 31న డివిడెండ్ మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. కంపెనీ సభ్యుల రిజిస్టర్‌లో పేర్లు ఉన్న ఈక్విటీ షేర్‌హోల్డర్లు లేదా డిపాజిటరీ రికార్డుల్లో బెనిఫిషియల్ ఓనర్లుగా నమోదైన పెట్టుబడిదారులు ఈ డివిడెండ్‌కు అర్హులు. కాగా 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టీసీఎస్ కన్సాలిడేటెడ్ నికర లాభం 2.7 శాతం తగ్గి రూ.13,349 కోట్లకు చేరింది. గత త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.13,718 కోట్లు నమోదైంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో లీగల్ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ కోసం రూ.668 కోట్ల ఒకేసారి వ్యయం నమోదవడం లాభాలపై ప్రభావం చూపింది.
పెరిగిన త్రైమాసిక ఆదాయం..
అయితే కంపెనీ ఆదాయం మాత్రం పెరిగింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో కన్సాలిడేటెడ్ రెవెన్యూ త్రైమాసిక ప్రాతిపదికన 2.2 శాతం పెరిగి రూ.72,275 కోట్లకు చేరింది. గత త్రైమాసికంలో ఇది రూ.70,698 కోట్లుగా ఉంది. ఆపరేటింగ్ ఇన్‌కమ్ లేదా వడ్డీ, పన్నులకు ముందు లాభం (ఈబీఐటీ) 3 శాతం తగ్గి రూ.17,317 కోట్లకు చేరగా, గత త్రైమాసికంలో ఇది రూ.17,870 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ కూడా 25.3 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. వేతనాల పెంపు కారణంగా మార్జిన్‌పై ఒత్తిడి ఏర్పడినట్లు కంపెనీ తెలిపింది. షేర్ మార్కెట్‌లో టీసీఎస్ షేర్ క్రితం సెషన్‌లో 2067.90 వద్ద ముగిసింది. గత 52 వారాల్లో టీసీఎస్ షేర్ కనిష్ఠంగా రూ.1,976.80, గరిష్ఠంగా రూ.3,399 స్థాయిని తాకింది. ఏడాది ప్రాతిపదికన ఈ షేర్ ధర 39.43 శాతం క్షీణించింది. ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11.44 లక్షల కోట్లు కాగా, కంపెనీ పీ/ఈ నిష్పత్తి 15.07గా ఉంది.
సంబంధిత వార్తలు

TCS | టీసీఎస్ షేర్‌హోల్డర్లకు గుడ్‌న్యూస్.. రూ.12 డివిడెండ్
అక్టోబర్ 9, 2026

US Green Card Suspension | భారత ఐటీ కంపెనీలకు అమెరికా బిగ్ షాక్: TCS, ఇన్ఫోసిస్, విప్రోలకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ రద్దు
అక్టోబర్ 8, 2026

Rahul Gandhi | ఫారమ్-6లో మార్పులు చేయమని టీసీఎస్‌ను ఎవరు ఆదేశించారు..? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన రాహుల్
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు



