త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | లెనిన్ స‌క్సెస్ మీట్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న భాగ్య‌శ్రీ బోర్సే – హైద‌రాబాద్ నా క‌ర్మ‌భూమి అంటూ కామెంట్స్‌

భాగ్య‌శ్రీ బోర్సే ఎమోష‌న‌ల్ అయ్యింది. శ‌నివారం జ‌రిగిన లెనిన్ స‌క్సెస్ మీట్‌లో స్టేజ్‌పై మాట్లాడే క్ర‌మంలో క‌న్నీళ్లు పెట్టుకుంది. హైద‌రాబాద్ త‌న క‌ర్మ‌భూమి అని, చివ‌రి సినిమా ఇక్క‌డే చేస్తానంటూ కామెంట్స్ చేసింది.

N

Entertainment | Published On Jul 11, 2026, 2.45 pm IST

Bhagyashri Borse | లెనిన్ స‌క్సెస్ మీట్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న భాగ్య‌శ్రీ బోర్సే – హైద‌రాబాద్ నా క‌ర్మ‌భూమి అంటూ కామెంట్స్‌
Advertisement

Bhagyashri Borse | సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. విజ‌యాల్లో ఉన్న వారి చుట్టూనే సినీ ప‌రిశ్ర‌మ మొత్తం తిరుగుతుంది . కొంద‌రు నాయ‌కానాయిక‌లు ఈజీగా విజ‌యాలు అందుకుంటారు. మ‌రి కొంద‌రు ఎంత క‌ష్ట‌ప‌డినా విజ‌యం మాత్రం ద‌క్క‌దు. అందం, అభిన‌యం అన్ని ఉన్న అదృష్టం క‌లిసిరాదు. భాగ్య‌శ్రీ బోర్సే ఈ కోవ‌కే చెందుతుంది. కెరీర్ ఆరంభం నుంచి స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోంది. మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. గ్లామ‌ర్‌తో మెప్పించ‌గ‌ల‌న‌ని నిరూపించుకుంది. కానీ స‌క్సెస్ విష‌యంలో మాత్రం ఈ అమ్మ‌డికి ఇప్ప‌టివ‌ర‌కు ల‌క్కు క‌లిసి రాలేదు. ఆమె చేసిన నాలుగు తెలుగు సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిలిచాయి.

లెనిన్‌తో...

భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించిన లెనిన్ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఈ మూవీకి ముర‌ళీ కృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. ముఖ్యంగా భాగ్య‌శ్రీ బోర్సే పాత్ర, న‌ట‌న బాగున్నాయంటూ ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. లెనిన్‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌తో భాగ్య‌శ్రీ బోర్సే ఎమోష‌న‌ల్ అయ్యింది. శ‌నివారం మేక‌ర్స్ లెనిన్ థాంక్స్ మీట్‌ను నిర్వ‌హించారు.

చివ‌రి సినిమా తెలుగులోనే...

ఈ వేడుక‌లో స్టేజ్‌పై మాట్లాడే క్ర‌మంలో భాగ్య‌శ్రీ క‌న్నీళ్లు పెట్టుకుంది. తెలుగు ప్రేక్ష‌కుల స‌పోర్ట్ వ‌ల్లే ఈ స్థాయికి చేరుకున్నాన‌ని అన్న‌ది. "హైద‌రాబాద్ నా క‌ర్మ‌భూమి. చివ‌రి సినిమా కూడా తెలుగులోనే చేస్తా" అంటూ చెప్పింది. ఏడుస్తూనే త‌న స్పీచ్‌ను కొన‌సాగించింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

భార‌తిగా...

లెనిన్‌లో భార‌తి అనే పాత్ర‌లో భాగ్య‌శ్రీ న‌టించింది. ఆధిప‌త్య ధోర‌ణి, ధైర్యం క‌ల‌గ‌లిసిన అమ్మాయిగా నాచుర‌ల్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచింది. ఈ సినిమాకు చిత్తూరు యాస‌లో తానే సొంతంగా డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది. నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ క‌లిసి నిర్మించిన లెనిన్ తొలి రోజు ప‌ద‌హారు కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

Advertisement
Advertisement