త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meenakshi Chaudhary | అభిమానుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన మీనాక్షి చౌద‌రి.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

Meenakshi Chaudhary | టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌద‌రి అభిమానుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. త‌న పేరును ఉప‌యోగించి కొంద‌రు మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిపింది. సోషల్ మీడియాలో తన పేరుతో ఫోన్ కాల్స్ చేయ‌డంతో పాటు మెసేజెస్ పంపుతున్న‌ట్లుగా చెబుతూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

P

Entertainment | Published On Jun 13, 2026, 9.30 pm IST

Meenakshi Chaudhary | అభిమానుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన మీనాక్షి చౌద‌రి.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?
Advertisement

Meenakshi Chaudhary | టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌద‌రి అభిమానుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. త‌న పేరును ఉప‌యోగించి కొంద‌రు మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిపింది. సోషల్ మీడియాలో తన పేరుతో ఫోన్ కాల్స్ చేయ‌డంతో పాటు మెసేజెస్ పంపుతున్న‌ట్లుగా చెబుతూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫేన్ నంబ‌ర్‌ను షేర్ చేసింది. "ఈ నంబర్ నుంచి మీకు కాల్, మెసేజ్ వస్తే దయచేసి రిపోర్ట్ చేయండి. అది నేను కాదు. ఈ సమాచారాన్ని నాతో పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని పేర్కొంది. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆమె హెచ్చరికను ఇతరులకు షేర్ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మీనాక్షి చౌదరి సినిమాల విష‌యానికి వ‌స్తే.. వరుస ప్రాజెక్టులతో బిజీగా బిజీగా ఉన్నంది. . ఇటీవల 'లక్కీ భాస్కర్' చిత్రంతో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం నాగచైతన్య సరసన నటిస్తున్న వృషకర్మ మూవీలో న‌టిస్తోంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీలో మీనాక్షి 'దక్ష' అనే కీలక పాత్రలో క‌నిపించ‌నుంది. ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కొద్ది నెలల క్రితం ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడిన నాగచైతన్య.. ఇది భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న మైథలాజికల్ థ్రిల్లర్ అని తెలిపారు. తన 15 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇలాంటి విస్తృత స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించడం ఇదే తొలిసార‌ని తెలిపాడు. అడ్వెంచర్, ట్రెజర్ హంటింగ్ అంశాల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement