Chiranjeevi | అది నా పూర్వజన్మ సుకృతం.. ప్రత్యేక వీడియో షేర్ చేసిన చిరంజీవి
Chiranjeevi | నేడు హనుమాన్ జయంతి (Hanuman Jayanti). ఈ సందర్భంగా ఆ హనుమంతుడి దర్శనం కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హనుమంతుడికి పరమభక్తుడన్న విషయం తెలిసిందే.
Chiranjeevi | నేడు హనుమాన్ జయంతి (Hanuman Jayanti). ఈ సందర్భంగా ఆ హనుమంతుడి దర్శనం కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హనుమంతుడికి పరమభక్తుడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. "అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను" అంటూ ఓ ప్రత్యేక వీడియోని షేర్ చేశారు. అందులో మెగాస్టార్ ఇంట్లో చోటు చేసుకునే ఓ అపురూప దృశ్యం గురించి అభిమానులకు వివరించారు.
"హనుమాన్ జయంతి సందర్భంగా మా పూజా మందిరంలో జరుగుతున్న ఒక విశేషాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని పై నుంచి కింది వరకూ స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే.. ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఇటీవలే మనం అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసురించి మెరిసిన అద్భుత దృశ్యాన్ని చూశాం. అలాగే కోణార్క్, అరసవల్లి దేవాలయాల్లో కూడా సూర్యకిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందే. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుడిని స్మృశించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు" అని చిరంజీవి ఆ వీడియోలో తెలిపారు.
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏#HanumanJayanti pic.twitter.com/fafTx4x9xL
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2026
Also Read..
RGUKT | బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు.. మే 10 వరకు దరఖాస్తులు
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్ వీడియో లీక్ - డౌట్స్‌కు చెక్ పెట్టిన రౌడీబాయ్
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



