త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | మెగా 158లో మోహ‌న్‌లాల్.. కుమార్తెగా మ‌ల‌యాళ బ్యూటీ!

Mega 158 Movie | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా స‌రికొత్త ప్రారంభ‌మైంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మెగా 158 (వ‌ర్కింగ్ టైటిల్‌-Mega 158 Movie) రూపొందుతున్న ఈ మూవీ పూజాకార్య‌క్ర‌మాల‌ను హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఘ‌నంగా నిర్విహించారు.

G

Entertainment | Published On May 21, 2026, 10.49 am IST

Chiranjeevi | మెగా 158లో మోహ‌న్‌లాల్.. కుమార్తెగా మ‌ల‌యాళ బ్యూటీ!
Advertisement

Chiranjeevi | త్రినేత్ర‌.న్యూస్‌: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా స‌రికొత్త ప్రారంభ‌మైంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మెగా 158 (వ‌ర్కింగ్ టైటిల్‌-Mega 158 Movie) రూపొందుతున్న ఈ మూవీ పూజాకార్య‌క్ర‌మాల‌ను హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఘ‌నంగా నిర్విహించారు. ముఖ్య అతిథులుగా స్టార్ హీరో పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌, నాగబాబు హాజరయ్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించ‌గా, చిరు కుమార్తె, నిర్మాత సుస్మిత కెమెరా స్విచ్ ఆన్ చేశారు. `వాల్తేరు వీరయ్య` తర్వాత బాబీ - చిరు కాంబినేషన్​లో రూపొందనున్న రెండో చిత్రం కావ‌డం విశేషం. ఈ పాన్ ఇండియ‌న్ మూవీని క‌న్న‌డ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. సినిమాలోని కొత్త లుక్‌ కోసం జిమ్‌లో క‌ఠిన‌మైన‌ వ‌ర్క‌వుట్స్ చేస్తూ చిరంజీవి క‌నిపించారు. మాస్‌ అంశాలతో నిండిన శక్తిమంతమైన యాక్షన్‌ కథతో ఈ సినిమా ముస్తాబు కాబోతున్న‌ది. చిరు ఇందులో రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నట్లు తెలుస్తున్న‌ది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఫ‌స్ట్ షెడ్యూల్ నుంచే చిరంజీవి చిత్రీక‌ర‌ణ‌లో భాగం కానున్న‌ట్లు టాక్.

మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్‌లాల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ట‌. చిరంజీవికి జోడీగా ప్రియ‌మ‌ణి హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని అంటున్నారు. మ‌రో కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ యంగ్ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆమె చిరుకు కుమార్తెగా క‌నిపించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి తెరపైకి వచ్చే అవకాశముంది. ఈ ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు`తో మెగాస్టార్‌ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ మూవీ రూ.400 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇదే జోష్‌లో మ‌రోసారి సంక్రాంతి పోటీకి చిరు సిద్ధ‌మ‌వుతున్నారు.

Advertisement
Advertisement