త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | న‌న్ను ఇంట్లోకి రానివ్వ‌డంలేదు.. కోర్టులో మ‌రో పిటిష‌న్ వేసిన విజ‌య్ భార్య‌ సంగీత‌

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay)కు ఆయ‌న భార్య సంగీత (Sangeeta) మ‌రో షాకిచ్చింది. చెన్నైలోని నీలంక‌రై ఇంట్లోకి (Neelankarai House) త‌న‌ను అనుమ‌తించ‌డం లేద‌ని ఆమె ఆరోపించారు. విడాకుల కేసు ముగిసే వ‌ర‌కూ తాను విజ‌య్ ఇంట్లోనే ఉంటాన‌ని, అందుకు అనుమ‌తివ్వాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

D

Movies | Published On Mar 7, 2026, 1.12 pm IST

Thalapathy Vijay | న‌న్ను ఇంట్లోకి రానివ్వ‌డంలేదు.. కోర్టులో మ‌రో పిటిష‌న్ వేసిన విజ‌య్ భార్య‌ సంగీత‌
Advertisement

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay)కు ఆయ‌న భార్య సంగీత (Sangeeta) మ‌రో షాకిచ్చింది. విజ‌య్‌తో త‌న‌కు విడాకులు ఇప్పించాలంటూ చెంగ‌ల్ప‌ట్టు ఫ్యామిలీ కోర్టు (Chengalpattu Court)లో మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. అంతేకాదు చెన్నైలోని నీలంక‌రై ఇంట్లోకి (Neelankarai House) త‌న‌ను అనుమ‌తించ‌డం లేద‌ని ఆమె ఆరోపించారు. విడాకుల కేసు ముగిసే వ‌ర‌కూ తాను విజ‌య్ ఇంట్లోనే ఉంటాన‌ని, అందుకు అనుమ‌తివ్వాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఆ ఇంట్లో త‌న‌కూ స‌గం వాటా ఉంద‌ని తెలిపారు.

"మా మ‌ధ్య అభిప్రాయ బేధాల కార‌ణంగా విడిపోవాల‌నుకుంటున్నాం. ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడిపోవాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అందుకే కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. బ్రిటిష్ పౌరురాలైన నాకు భార‌త్‌లో మ‌రో ఇల్లు లేక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాను. నీలంక‌రై ఇంట్లోకి న‌న్ను అనుమ‌తించ‌డం లేదు. అందుకే విడాకుల కేసులో తుది తీర్పు వ‌చ్చే వ‌ర‌కూ నేను గ‌త 26 ఏళ్లుగా విజ‌య్‌తో క‌లిసి నివ‌సించిన ఇంట్లోనే ఉండేందుకు అనుమ‌తించాలని కోరుతున్నాను. ఆ ఇంట్లో నాకు స‌గం వాటా ఉంది" అని త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

విడాకులు కావాలి..

ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay), సంగీత (Sangeeta) విడాకుల వ్య‌వ‌హారం ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌తోపాటూ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. 26 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్న సంగీత.. విడాకుల కోసం చెన్నైలోని చెంగ‌ల్ప‌ట్టు కోర్టులో ఇటీవ‌లే పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా త‌న భ‌ర్త‌పై ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మరో నటితో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మానసికంగా వేదనకు గురిచేశాడని ఆరోపించింది. ఆమెతో బంధాన్ని తెచ్చుకుంటాన‌ని మాటిచ్చిన విజ‌య్‌.. దానిని నిల‌బెట్టుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అంతేకాదు ఆ హీరోయిన్‌తో క‌లిసి విదేశాల‌కు విహార‌యాత్ర‌కు కూడా వెళ్లాడ‌ని సంగీత త‌న పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఏడాది కాలంగా చాలానే ప్ర‌య‌త్నాలు చేశాన‌ని, అవేవీ ఫ‌లించ‌లేద‌ని సంగీత పిటిష‌న్‌లో పేర్కొంది. మ‌రో మార్గం లేకే విడాకుల తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

భార్య‌కు రూ.250 కోట్లు ఆఫ‌ర్ చేసిన విజ‌య్‌..?

విడాకుల విష‌యంలో విజ‌య్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. ఈ వ్య‌వ‌హారాన్ని సైలెంట్‌గా ప‌రిష్క‌రించాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే భార్య సంగీత‌కు భారీ మొత్తంలో భ‌ర‌ణం ఆఫ‌ర్ (Rs. 250 crores as alimony) చేసిన‌ట్లు త‌మిళ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో రాజీ కుదుర్చుకునేందుకు విజ‌య్ త‌న భార్య‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. కోర్టు వ‌ర‌కూ వెళ్ల‌కుండా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుందామ‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. ఇందుకోసం సంగీత‌కు విజ‌య్ రూ.250 కోట్లు భ‌ర‌ణం ఆఫ‌ర్ చేసిన‌ట్లు స‌మాచారం. సంగీత‌తోపాటూ ఇద్ద‌రు పిల్ల‌లు జాస‌న్ సంజ‌య్‌, దివ్య సాషాల భ‌విష్య‌త్తు కోసం ఇంత మొత్తాన్ని ఇచ్చేందుకు విజ‌య్ సిద్ధ‌ప‌డిన‌ట్లు టాక్‌.

Also Read..

Scott Bessent | చ‌మురు కొనుగోళ్ల విష‌యంలో భార‌త్ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించింది : అమెరికా

Web Series Review | బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

Amazon Electronics Premiere League Sale | అమెజాన్‌లో ఎల‌క్ట్రానిక్స్ ప్రీమియ‌ర్ లీగ్ (ఈపీఎల్‌) ప్ర‌త్యేక సేల్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..

Advertisement

తాజావార్తలు

Advertisement