Amazon Electronics Premiere League Sale | అమెజాన్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ప్రత్యేక సేల్.. భారీ తగ్గింపు ధరలు..
Amazon Electronics Premiere League Sale | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ మార్చి 6న ప్రారంభం కాగా 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో యాపిల్, శాంసంగ్, అసుస్, సోనీ, డెల్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు.
Amazon Electronics Premiere League Sale | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ మార్చి 6న ప్రారంభం కాగా 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో యాపిల్, శాంసంగ్, అసుస్, సోనీ, డెల్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు వంటి ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చు. ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా 5జి ఫోన్ (కోబాల్ట్ వయోలెట్, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్)ను రూ.1,39,999కు కొనవచ్చు. ఐఫోన్ 17ఇ 256జీబీ మోడల్‌ను రూ.64,900కు ఇస్తున్నారు. ఐక్యూ 15ఆర్ (8జీబీ, 256జీబీ) ను రూ.40,999కు ఇస్తున్నారు.
ఫోన్లు, ల్యాప్ టాప్‌లపై..
సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ 5 (రూ.32,499), శాంసంగ్ గెలాక్సీ ఎం56 5జి (రూ.20,999), రియల్‌మి నార్జో 90ఎక్స్ 5జి (రూ.12,999), లావా బోల్డ్ ఎన్2 (రూ.6,999) ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఈ ఫోన్లపై ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లను, కూపన్‌లను ఇస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఏసర్ ఆస్పయిర్ గో 14 ల్యాప్‌టాప్‌ను రూ.49,878 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 రూ.68,990కి లభిస్తోంది. అసుస్ వివోబుక్ ఎస్16ను రూ.75,999కు, ఏసర్ నైట్రో వి15ను రూ.74,990కి, హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్ టాప్‌ను రూ.78,999కు ఇస్తున్నారు. వీటిపై ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తోపాటు రూ.3వేల వరకు కూపన్ డిస్కౌంట్‌ను కూడా ఇస్తున్నారు.
ఇతర ఉత్పత్తులపై కూడా..
ఈ సేల్‌లో గోబౌల్ట్ క్యూ (రూ.1799), బోట్ రాకర్జ్ 650 ప్రొ (రూ.2599), జేబీఎల్ ట్యూన్ 770ఎన్సీ వైర్‌లెస్ ఓవర్ ఇయర్ ఏఎన్‌సీ హెడ్‌ఫోన్స్ (రూ.4,999), సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎం6 (రూ.37,989) వంటి హెడ్ ఫోన్స్‌ను తగ్గింపు ధరలకు పొందవచ్చు. అలాగే వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3ఆర్, రియల్‌మి బడ్స్ టి310 ట్రూ వైర్‌లెస్ ఇన్ ఇయర్ బడ్స్, బోట్ నిర్వానా క్రౌన్, రియల్‌మి బడ్స్ ఎయిర్ 8, వన్ ప్లస్ బడ్స్ 4 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, ట్యాబ్‌లు, కెమెరాల, యాక్ససరీలపై కూడా ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నారు.
బ్యాంకు ఆఫర్..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం అయిన అమెజాన్ ఆ బ్యాంకు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ.4500 వరకు అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు అమెజాన్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) పేజీని సందర్శించవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?
- ●Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్
- ●US H-1B Visa Renewal Fees | H-1B, L-1 వీసా రెన్యువల్స్‌పై కొత్త ఫీజులు.. అమెరికాలో మన ఐటీ నిపుణులకు భారీ షాక్!
- ●Black Magic | హరీశ్‌రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు.. ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన రేవంత్
- ●Telangana Irrigation | కిం కర్తవ్యం? సాగునీటికి కటకటేనా..!

Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!

Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?

Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్

US H-1B Visa Renewal Fees | H-1B, L-1 వీసా రెన్యువల్స్‌పై కొత్త ఫీజులు.. అమెరికాలో మన ఐటీ నిపుణులకు భారీ షాక్!






