త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series Review | విక్ర‌మ్ ఆన్ డ్యూటీ రివ్యూ – బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

బిగ్‌బాస్ తెలుగు విన్న‌ర్ నిఖిల్ హీరోగా న‌టించిన విక్ర‌మ్ ఆన్ డ్యూటీ వెబ్‌సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఎలా ఉందంటే?

N

Entertainment | Published On Mar 7, 2026, 12.25 pm IST

Web Series Review | విక్ర‌మ్ ఆన్ డ్యూటీ రివ్యూ –  బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
Advertisement

Web Series Review |  బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ మ‌లియ‌క్క‌ల్ లీడ్ రోల్‌లో న‌టించిన తెలుగు వెబ్‌సిరీస్ విక్ర‌మ్ ఆన్ డ్యూటీ ఇటీవ‌ల జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సిరీస్‌కు హ‌ర్ష‌శ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ వెబ్ సిరీస్‌తో నిఖిల్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడా? లేదా? అంటే?

విక్ర‌మ్ ఇన్వేస్టిగేష‌న్‌...

కేసారం ఊరికి చెందిన శిరీష హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది. తాత‌య్య త‌ప్ప ఆమెకు ఎవ‌రూ ఉండ‌రు. తాత‌య్య‌ను చూడ‌టానికి ఊరికి వ‌చ్చి తిరుగుప్ర‌యాణ‌మైన శిరీష‌పై ఓ ముసుగువ్య‌క్తి ఎటాక్ చేస్తాడు. ఆమెను లైంగికంగా వేధిస్తాడు. ఈ కేసు సంచ‌ల‌నంగా మారుతుంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు పోలీసులు ఒక్క క్లూ కూడా సంపాదించ‌లేక‌పోతారు. ఈ కేసును విక్ర‌మ్‌కు అప్ప‌గించాల‌ని క‌మీష‌న‌ర్ అనుకుంటాడు. కానీ విక్ర‌మ్‌పై ఉన్న ఓ కేసు కార‌ణంగా పోలీస్ యూనిఫామ్ లేకుండానే ఈ కేసును ఇన్వేస్టిగేట్ చేయాల్సివ‌స్తుంది. శిరీష కేసు ఇన్వేస్టిగేష‌న్ మొద‌లుపెట్టిన శివ‌కు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి. శిరీష‌పై ఎటాక్ చేసింది ఎవ‌రు? ఈ కేసుతో అశోక్‌, శివ అనే క్రిమిన‌ల్స్‌కు సంబంధం ఉందా? శిరీష‌ను చంపాల‌ని చూసిన మంజు ఎవ‌రు అన్న‌దే విక్ర‌మ్ ఆన్ డ్యూటీ క‌థ‌.

క్రైమ్ థ్రిల్ల‌ర్‌ల‌కే ఆద‌ర‌ణ‌...

వెబ్ సిరీస్‌ల‌లో మిగిలిన జాన‌ర్స్‌తో పోలిస్తే క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కే ఎక్కువ‌గా ఆద‌ర‌ణ ఉంటుంది. వెండితెర‌పై చెప్ప‌లేని కొన్ని క్రైమ్ క‌థ‌ల‌ను వెబ్‌సిరీస్‌ల ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్ట‌ర్లు. విక్ర‌మ్ ఆన్ డ్యూటీ తో అలాంటి ప్ర‌య‌త్న‌మే చేశారు డైరెక్ట‌ర్ హ‌ర్ష‌శ్రీ. ఎలాంటి ఆధారాలు లేని ఓ నేరాన్ని త‌న తెలివితేట‌ల‌తో ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదించాడు అన్న‌దే ఈ సిరీస్ క‌థ.
నేరుగా క్రైమ్ సీన్‌తోనే ఈ సిరీస్‌ను మొద‌లుపెట్టారు డైరెక్ట‌ర్‌. అక్క‌డి నుంచి హీరో పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌డం, ఇన్వేస్టిగేష‌న్ ప్రారంభించిన త‌ర్వాత ఒక్క అనుమానితుడు వెలుగులోకి వ‌చ్చే అంశాల‌తో చివ‌రి వ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌గా సాగింది.

హీరో ఫ్లాష్‌బ్యాక్‌...

హీరో క్యారెక్ట‌ర్ విష‌యంలో స‌స్పెన్స్ మెయింటేన్ చేయ‌డం బాగుంది. అత‌డికో గ‌తం...దాని కార‌ణంగా పోలీస్ జాబ్ చేస్తున్నా...ఖాకీ చొక్కా వేసుకోలేని ప‌రిస్థితి..అందుకు కార‌ణ‌మేమిట‌న్న‌ది బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్స్‌తో చెప్పి ఓ క్యూరియాసిటీని క‌లిగించారు. పూర్తిగా సీరియ‌స్‌గా కాకుండా విక్ర‌మ్ క్యారెక్ట‌ర్ పిసినారిగా ప్ర‌జెంట్ చేస్తూ ఫ‌న్ జ‌న‌రేట్ చేశారు.

నాలుగు ఎపిసోడ్స్ మాత్ర‌మే...

విక్ర‌మ్ ఆన్ డ్యూటీ పూర్తి వెబ్‌సిరీస్‌ను కాకుండా నాలుగు ఎపిసోడ్స్ మాత్ర‌మే రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఈ నాలుగు ఎపిసోడ్స్‌లో క్రిమిన‌ల్ ఎవ‌ర‌న్న‌ది రివీల్ చేయ‌లేదు. వెబ్‌సిరీస్‌లా కాకుండా సీరియ‌ల్‌ను త‌ల‌పించింది. మిగిలిన యాక్ట‌ర్ల విష‌యంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది.

కామెడీ...సీరియ‌స్‌నెస్‌...

విక్ర‌మ్ పాత్ర‌లో నిఖిల్ యాక్టింగ్ బాగుంది. సీరియ‌స్‌నెస్‌తో పాటు కామెడీ రెండింటిని చ‌క్క‌గా బ్యాలెన్స్ చేశాడు. గాయ‌త్రి, స‌మీర్‌తో పాటు మిగిలిన వారి న‌ట‌న ప‌ర్వాలేద‌నిపిస్తుంది.
నిఖిల్ ఫ్యాన్స్‌ను విక్ర‌మ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ కొంత వ‌ర‌కు మెప్పిస్తుంది. ఇలాంటి క్రైమ్ క‌థ‌ల‌తో గ‌తంలో వివిధ భాష‌ల్లో చాలానే సిరీస్‌లు వ‌చ్చాయి. వాటి స్థాయిలో గ్రిప్పింగ్‌గా మాత్రం లేదు.

Advertisement
Advertisement