Scott Bessent | చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది : అమెరికా
Scott Bessent | చమురు కొనుగోళ్ల విషయంలో (India to buy Russian oil) భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని అమెరికా ట్రెజరీ శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessent) అన్నారు.
International | Published On Mar 7, 2026, 12.44 pm IST
Scott Bessent | చమురు కొనుగోళ్ల విషయంలో (India to buy Russian oil) భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని అమెరికా ట్రెజరీ శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessent) అన్నారు. "భారతీయులు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఆంక్షలు ఉన్న రష్యా చమురును కొనొద్దని మేము కోరగా.. అందుకు వారు అంగీకరించారు. ఆ లోటును అమెరికా చమురుతో భర్తీ చేయాలని వారు భావించారు" అని తెలిపారు.
"అయితే, ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాత్కాలిక చమురు కొరతను అధిగమించేందుకు సముద్రంలో సిద్ధంగా ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు మా మిత్రదేశమైన భారత్‌కు మేము అనుమతి ఇచ్చాము. ఇతర రష్యా చమురు నిల్వలపై కూడా మేము ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు. ప్రస్తుతం వందలాది మిలియన్ల బ్యారెళ్ల నిషిద్ధ ముడి చమురు సముద్ర మార్గాల్లో ఉందని తెలిపారు. వాటిపై ఆంక్షలు తొలగించడం ద్వారా మార్కెట్‌లోకి కొత్త సరఫరాను తీసుకురావచ్చని బెసెంట్ తెలిపారు. యుద్ధ సమయంలో మార్కెట్‌కు ఊరటనిచ్చేలా ఇలాంటి చర్యలను ప్రకటించే ప్రక్రియ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
30 రోజుల పాటు రష్యా చమురు కొనొచ్చు..
ఇరాన్‌పై అమెరికా (US), ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతుండటంతో మధ్య ప్రాచ్యంలో (Middle East) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో చమురు రవాణాలో (Crude Oil) అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని (Hormuz Strait) ఇరాన్ మూసివేసింది. ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో ముడిచమురు దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌లో (India) ఇంధన కొరత ఏర్పడనుంది. ఈ క్రమంలోనే అమెరికా ట్రెజరీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా (Russian Oil) నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. అంతకుముందు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
Also Read..
Pakistani man | ఇరాన్‌తో కలిసి ట్రంప్ హత్యకు కుట్ర.. దోషిగా తేలిన పాకిస్థానీ
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. యుద్ధం ఎఫెక్ట్ మొదలైందా..?
బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
సంబంధిత వార్తలు

US Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. మద్దతు తెలిపిన యూఎస్ సెనేటర్లు
జులై 17, 2026

DGMA | హర్మూజ్ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
జులై 16, 2026

Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం
జులై 15, 2026
తాజావార్తలు
- ●Rajinikanth Goud Photo Journalist | ఇంటర్నేషనల్ ఫోటో కంటెస్ట్‌లో సత్తా చాటిన తెలంగాణ.. నమస్తే తెలంగాణ ఫోటో జర్నలిస్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు!
- ●ఇంటి నంబర్ 13 తీసుకుంటే ప్రమాదమా? నిజం ఇదే!
- ●Adluri Lakshman Kumar | మేడిగడ్డను కూల్చి.. గోదావరిపై రాజకీయాలా?
- ●Bihar by elections | ఉప ఎన్నికల్లో బీజేపీకి కుదుపు.. 3 సీట్లలో రెండింట్లో ఓటమి
- ●Rakesh Kumar | ఫీజు రీయింబర్స్మెంట్ ఏపీలో ఇస్తేనే తెలంగాణల ఇస్తరా?
- ●Bankipur Bypoll | మోదీ-షాలకు ఇక ఇంటిదారే

Rajinikanth Goud Photo Journalist | ఇంటర్నేషనల్ ఫోటో కంటెస్ట్‌లో సత్తా చాటిన తెలంగాణ.. నమస్తే తెలంగాణ ఫోటో జర్నలిస్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు!

ఇంటి నంబర్ 13 తీసుకుంటే ప్రమాదమా? నిజం ఇదే!

Adluri Lakshman Kumar | మేడిగడ్డను కూల్చి.. గోదావరిపై రాజకీయాలా?

Bihar by elections | ఉప ఎన్నికల్లో బీజేపీకి కుదుపు.. 3 సీట్లలో రెండింట్లో ఓటమి



