త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Britney Spears | మ‌ద్యం సేవించి డ్రైవింగ్‌.. పాప్ స్టార్ బ్రిట్నీ స్పియ‌ర్స్ అరెస్ట్

Britney Spears | అమెరికన్ పాప్ స్టార్ (American singer) బ్రిట్నీ స్పియ‌ర్స్ (Britney Spears) అరెస్ట‌య్యారు. మ‌ద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న (influence of alcohol) ఈ పాప్ స్టార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

D

Movies | Published On Mar 6, 2026, 11.23 am IST

Britney Spears | మ‌ద్యం సేవించి డ్రైవింగ్‌.. పాప్ స్టార్ బ్రిట్నీ స్పియ‌ర్స్ అరెస్ట్
Advertisement

Britney Spears | అమెరికన్ పాప్ స్టార్ (American singer) బ్రిట్నీ స్పియ‌ర్స్ (Britney Spears) అరెస్ట‌య్యారు. బుధవారం రాత్రి దక్షిణ కాలిఫోర్నియాలో మ‌ద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న (influence of alcohol) ఈ పాప్ స్టార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియా (California) హైవే పెట్రోలింగ్ పోలీసులు ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. రాత్రి 9:30 గంట‌ల ప్రాంతంలో బ్రిట్నీ మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డుపుతుండ‌గా.. కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులు సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా ఆమెను ఆపి ప‌రీక్షించారు. ఈ ప‌రీక్ష‌ల్లో బ్రిట్నీ మ‌ద్యం సేవించిన‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. యూఎస్ చట్ట ప్రకారం మ‌ద్యం మ‌త్తులో వాహ‌నం న‌డ‌ప‌డం తీవ్ర‌మైన నేరం కావ‌డంతో అక్క‌డిక్క‌డే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ త‌ర్వాత ఆమెను విడుద‌ల చేశారు. మే 4న వెంచురా కౌంటీ సుపీరియర్ కోర్టులో ఆమె విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 2, 1981న మిస్సిస్సిప్పిలో జన్మించిన బ్రిట్నీ.. లూసియానాలో పెరిగారు. చిన్నతనంలోనే "ది ఆల్ న్యూ మిక్కీ మౌస్ క్లబ్" (The All New Mickey Mouse Club) వంటి టీవీ షోల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1998లో విడుదలైన ఆమె తొలి సింగిల్ బేబీ వన్ మోర్ టైమ్ (Baby One More Time) ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఈ సాంగ్ ఆమెకు రాత్రికి రాత్రే స్టార్ డ‌మ్‌ను తెచ్చి పెట్టింది. ఆ త‌ర్వాత టాక్సిక్ (Toxic), ఎవ్రీటైమ్ (Everytime), గిమ్మీ మోర్ (Gimme More), ఉమనైజర్ (Womanizer), స్ట్రాంగర్ (Stronger) వంటి హిట్ పాటలతో స్పియర్స్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పాప్ స్టార్లలో ఒకరిగా నిలిచారు. ఆమెను ప్రిన్సెస్ ఆఫ్ పాప్ అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు ఆమె అరెస్ట్‌తో అంతా ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు.

Also Read..

Donald Trump | ముందు ఇరాన్ ప‌ని ముగిస్తాం.. ఆ త‌ర్వాత క్యూబా ప‌నిప‌డ‌తాం : ట్రంప్‌

Israel | ఖ‌మేనీని హ‌త‌మార్చాల‌ని గ‌త న‌వంబ‌ర్‌లోనే నిర్ణ‌యించుకున్నాం : ఇజ్రాయెల్‌

Stock Markets | భారీ న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. యుద్ధం ముగిసేవ‌ర‌కు అంతేనా..?

Advertisement

తాజావార్తలు

Advertisement