America | జీతం పెంచలేదని గోడౌన్‌కు నిప్పు పెట్టాడు.. యజమానికి 600 మిలియన్ డాలర్లు నష్టం..
America | అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒంటారియో నగరంలో ఓ భారీ గోడౌన్ లో సంభవించిన అగ్ని ప్రమాదం కేసులో ఓ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. వేతన సమస్యలపై ఆగ్రహం చెందిన అతను గోడౌన్‌ను తగలబెట్టినట్లు ఆధారాల ద్వారా వెల్లడైంది.
International | Published On Apr 11, 2026, 3.51 pm IST
America | అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒంటారియో నగరంలో ఓ భారీ గోడౌన్ లో సంభవించిన అగ్ని ప్రమాదం కేసులో ఓ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. వేతన సమస్యలపై ఆగ్రహం చెందిన అతను గోడౌన్‌ను తగలబెట్టినట్లు ఆధారాల ద్వారా వెల్లడైంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించగా, పశ్చిమ తీర ప్రాంతంలో అవసరమైన పేపర్ ప్రొడక్ట్స్ తయారీ సప్లై చెయిన్‌పై ప్రభావం పడింది. సదరు ఉద్యోగి తన వేతనాన్ని పెంచకపోవడంతోనే ఆగ్రహంతో ఆ భారీ గోడౌన్‌ను తగలబెట్టినట్లు తేలింది. ఆ గోడౌన్ విస్తీర్ణం 1.2 మిలియన్ల చదరపు అడుగులు కాగా ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 7వ తదీన అర్థరాత్రి 12:30 గంటల సమయంలో గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించారు. ఆ గోడౌన్‌లో పనిచేస్తున్న ఉద్యోగే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు.
https://twitter.com/CollinRugg/status/2041954196258533877
వేతనం పెంచలేదనే కారణంతోనే..
కాగా ఆ ఉద్యోగి గోడౌన్‌కు నిప్పు పెట్టే సమయంలో వీడియో తీశాడు. దీంతో ఆ వీడియో ఆధారంగానే పోలీసులు అతన్ని గుర్తించి అరెస్టు చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైలాండ్ అనే ప్రాంతానికి చెందిన చామెల్ అబ్దుల్ కరీమ్ (29) అనే వ్యక్తి సౌత్ హెల్మన్ అవెన్యూ , మెరిల్ అవెన్యూ సమీపంలో ఉన్న కింబర్లీ క్లార్క్ అనే కంపెనీకి చెందిన ఓ భారీ గోడౌన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కేవలం ఆ గోడౌన్ విలువనే దాదాపుగా 156 మిలియన్ డాలర్లు ఉండగా, అందులో టిష్యూలు, టాయిలెట్ పేపర్ వంటి పేపర్ ఉత్పత్తులను నిల్వ ఉంచుతారు. ఆ ఉత్పత్తుల విలువ భారీగా ఉంటుంది. అక్కడి నుంచి లక్షలాది మంది వినియోగదారులకు ఆ ఉత్పత్తులు సరఫరా అవుతాయి. అయితే తన వేతనం పెంచాలని యాజమాన్యాన్ని అడిగినా స్పందించ లేదనే కారణంతో అతను కోపంతో ఊగిపోయి గోడౌన్‌కు నిప్పు పెట్టాడు. అదే సమయంలో అతను వీడియో తీయడమే కాకుండా ఓ స్నేహితుడికి ఆ ఘటనపై సందేశం కూడా పంపించాడు.
600 మిలియన్ డాలర్ల నష్టం..
అగ్ని కీలలు ప్రారంభమైన సమయంలో గోడౌన్‌లో 20 మంది ఉద్యోగులు ఉండగా, ఎవరికీ ఎలాంటి గాయాలు అవకుండా సురక్షితంగా బయట పడ్డారు. తరువాత అబ్దుల్ కరీమ్ అక్కడి నుంచి పారిపోయాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకుని ఫైర్ అలారంలు మోగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మొత్తం 175 మంది అగ్నిమాపక సిబ్బంది చాలా సేపు శ్రమించి మంటలను ఆర్పారు. మంటల కారణంగా గోడౌన్ పైకప్పు కూలిపోయింది. దీంతో అందులో నిల్వ ఉంచిన ఉత్పత్తులు భారీ ఎత్తున ధ్వంసమయ్యాయి. చాలా వరకు ఉత్పత్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారుగా 600 మిలియన్ డాలర్ల నష్టం సంభవించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గోడౌన్‌కు నిప్పు పెడుతున్న సమయంలో తీసిన వీడియోలో కరీమ్ మాట్లాడిన మాటలు కూడా వినిపించాయి. తమకు వేతనాలను సరిగ్గా ఇస్తే ఇలా జరిగి ఉండేది కాదని అతను పెద్దగా అరవడం వీడియోలో కనిపించిందని పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
జులై 26, 2026

Errabelli Dayakar Rao | TTA ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం.. పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
జులై 20, 2026

Gujarat Fire | అహ్మదాబాద్‌లో పటాకులు ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఎనిమిది మంది మృతి.. పీఎం మోదీ సంతాపం
జులై 18, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?



