త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Old Tractor | అదృష్టాన్ని తెచ్చిపెట్టిన‌ తుప్పుప‌ట్టిన ట్రాక్ట‌ర్‌.. రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు

Old Tractor | పంజాబ్ (Punjab) జ‌లంధ‌ర్‌కు (Jalandhar) చెందిన ఓ వ్య‌క్తికి తుప్పుప‌ట్టిన ట్రాక్ట‌ర్ (Old Tractor) అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. ఏకంగా రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడిని (Indian Becomes a Crorepati Overnight) చేసింది.

D

National | Published On Feb 21, 2026, 12.06 pm IST

Old Tractor | అదృష్టాన్ని తెచ్చిపెట్టిన‌ తుప్పుప‌ట్టిన ట్రాక్ట‌ర్‌.. రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు
Advertisement

Old Tractor | పంజాబ్ (Punjab) జ‌లంధ‌ర్‌కు (Jalandhar) చెందిన ఓ వ్య‌క్తికి తుప్పుప‌ట్టిన ట్రాక్ట‌ర్ (Old Tractor) అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. ఏకంగా రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడిని (Indian Becomes a Crorepati Overnight) చేసింది. భ‌గ‌త్‌సింగ్ చౌక్ (Bhagat Singh Chowk) స‌మీపంలో ఉండే ఓ వ్య‌క్తి వ‌ద్ద 105 ఏళ్ల నాటి ట్రాక్ట‌ర్ ఉంది. అది ప‌నిచేయ‌క‌పోవ‌డంతో దాన్ని ఓ మూల‌కు ప‌డేశారు. దీంతో అది పూర్తిగా తుప్పుప‌ట్టి ఎందుకూ ప‌నికిరాకుండా పోయింది.

స‌ద‌రు వ్య‌క్తి ఓ రోజు స‌ర‌దాగా ఆ ట్రాక్ట‌ర్‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే.. ఆ ఒక్క వీడియో అత‌డి జీవితాన్నే మార్చేసింది. ఏకంగా కోటీశ్వ‌రుడిని చేసేసింది. ఆ తుప్పుప‌ట్టిన ట్రాక్ట‌ర్ ఓ విదేశీయుడిని ఆక‌ర్షించింది. స్క్రాప్‌కు వేస్తే రూ.10 వేలు కూడా రాని ఆ తుప్పుప‌ట్టిన ట్రాక్ట‌ర్‌ను అమెరికా కాలిఫోన్నియాకు చెందిన ఓ వ్య‌క్తి ఏకంగా రూ.1.25 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ వింటేజ్ ట్రాక్ట‌ర్‌ను అమెరికాలోని కాలిఫోర్నియా (California)లోగ‌ల ఓ మ్యూజియం (museum)లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచ‌నున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు. అంతేకాదు, త‌మ ఇంట్లో పాత‌కాలం నాటి వింటేజ్ వ‌స్తువుల‌ను వీడియోలు, ఫొటోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.

Advertisement
Advertisement