త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | తిరుమ‌ల‌లో బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు.. ఏయే తేదీల్లో అంటే?

TTD | క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. ప్రస్తుతం పవిత్ర పెరటాసి మాసం నడుస్తుండటం, వరుస సెలవులు రానుండ‌టంతో ర‌ద్దీ మ‌రింత పెరిగే అవకాశం ఉన్న‌ది.

G

Devotional | Published On Sep 29, 2026, 12.33 pm IST

TTD | తిరుమ‌ల‌లో బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు.. ఏయే తేదీల్లో అంటే?
Advertisement

TTD | త్రినేత్ర న్యూస్‌: క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. ప్రస్తుతం పవిత్ర పెరటాసి మాసం నడుస్తుండటం, వరుస సెలవులు రానుండ‌టంతో ర‌ద్దీ మ‌రింత పెరిగే అవకాశం ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. సామాన్య భక్తులకు స్వామి ద‌ర్శ‌నాల‌ను త్వ‌ర‌త‌గ‌తిన క‌ల్పించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాల‌ను (VIP Break Darshan) ర‌ద్దు చేసింది. అక్టోబ‌ర్ 1 (గురువారం), అక్టోబ‌ర్ 5 (సోమ‌వారం) తేదీల్లో ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు (Protocol Darshan) మాత్రమే బ్రేక్ ద‌ర్శ‌నాలు అనుమ‌తిస్తామ‌ని, ఇత‌ర సాధార‌ణ‌ వీఐపీల‌కు, దాత‌ల‌కు ఇచ్చే బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ మార్పులకు అనుగుణంగా, బ్రేక్ దర్శనాలు (Break Darshan) రద్దు చేసిన రోజులకు ముందు రోజు అంటే సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం, అక్టోబర్ 4వ తేదీ ఆదివారం ఎలాంటి సిఫార్సు లేఖలనూ స్వీకరించడం లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీనికి అనుగుణం భక్తులు (Devotees) తమ తిరుమల ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని కోరింది. కాగా, తిరుమ‌ల శ్రీవారిని ప్ర‌స్తుతం సుమారు 80 వేల మందికిపైగా భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నారు. అదేరోజు అద‌నంగా మ‌రో 30 వేల మంది భ‌క్తులు ద‌ర్శ‌నం కోసం వేచి ఉంటున్నార‌ని అధికారులు తెలిపారు. దీంతో అద‌న‌పు ర‌ద్దీ కార‌ణం మ‌రుస‌టి రోజు నిరీక్ష‌ణ స‌మ‌యం పెరుగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలోనే సాధార‌ణ భ‌క్తుల‌కు త్వ‌రిత‌గ‌తిన ద‌ర్శ‌నం క‌ల్పించేందు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు.

ఇవికూడా చ‌ద‌వండి..

తిరుమలలో ఒకే నెలలో రెండోసారి గరుడసేవ

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప‌క్కా ప్లాన్‌..!

 

Advertisement
Advertisement