TTD | నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ పక్కా ప్లాన్..!
TTD | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతంగా నిర్వహించాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో జేఈవో ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
Devotional | Published On Sep 28, 2026, 6.58 pm IST
TTD | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతంగా నిర్వహించాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో జేఈవో ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అన్నప్రసాదం, విద్యుత్, పుష్పాలంకరణ తదితర విభాగాలపై భక్తుల నుంచి 95 నుంచి 98 శాతం వరకు సంతృప్తి వ్యక్తమైనట్లు తెలిపారు. గుర్తించిన లోపాలను సరిదిద్దుకుని నవరాత్రి ఉత్సవాలకు మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
20శాతం అదనంగా భక్తుల అంచనా
అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, సాలకట్ల ఉత్సవాలు ముగిసిన 17 రోజులకే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని వెంకయ్య చౌదరి తెలిపారు. పూర్తిస్థాయిలో సెలవులు ఉండటంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల రద్దీని ప్రాతిపదికగా తీసుకుని అదనంగా 20 శాతం భక్తుల రాకను అంచనా వేస్తూ అన్నప్రసాదం, సామగ్రి, ప్రొక్యూర్‌మెంట్, స్టాకింగ్, రవాణా, లాజిస్టిక్స్‌పై ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల దర్శన సమయాన్ని తగ్గించేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని తెలిపారు. తొమ్మిది రోజుల్లో రోజుకు సగటున 73 వేల మంది మూలమూర్తిని దర్శించుకున్నారని, సాధారణంగా 5 నుంచి 8 గంటల్లో, గరిష్టంగా 10 గంటల్లోపు దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సర్వదర్శనానికి ప్రాధాన్యమిస్తూ వీఐపీ, ప్రివిలేజ్, సీనియర్ సిటిజన్లు, చిన్నపిల్లలు, శ్రీవాణి, ఎస్‌ఈడీ తదితర దర్శనాలపై అవసరమైన నియంత్రణలు కొనసాగిస్తామని తెలిపారు. అవసరాన్ని బట్టి కొన్ని దర్శనాలను తగ్గించడం లేదా రద్దు చేసి సర్వదర్శన భక్తుల వేచి ఉండే సమయాన్ని తగ్గించనున్నట్లు చెప్పారు.
భద్రత, వర్షాలపై ఫోకస్
జిల్లా పోలీసు యంత్రాంగంతో మరోసారి సమన్వయ సమావేశం నిర్వహించి భద్రతను పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. ఊరేగింపులు, వాహనసేవలను నిర్ణీత టైమ్‌లైన్‌లో నిర్వహించేలా విజిలెన్స్ విభాగం చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలను వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. అక్టోబర్‌లో వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వాహనసేవలతోపాటు ఎస్‌వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాదనీరాజనం నిర్వహణపైనా సమీక్షించారు. అన్ని విభాగాలు గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అధికారిక సమాచారాన్నే..
తిరుమలలో భక్తుల రద్దీ, వాహనాల రాక, పార్కింగ్, అన్నప్రసాదం, భద్రత తదితర అంశాలపై టీటీడీ ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం విడుదల చేస్తుందని అదనపు ఈవో తెలిపారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్, ఇతర అధికారిక వేదికల్లోని సమాచారాన్ని అనుసరించి తమ ప్రయాణ, దర్శన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యం, భద్రత, ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రాధాన్యమిస్తూ టీమ్‌వర్క్‌తో నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో టీటీడీ వివిధ విభాగాల అధికారులు, పోలీసు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Section 22A Land Issues | 22-ఏ పొరపాటు కాదు.. ఉద్దేశపూర్వకమే!
- ●OTT | డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన మౌనీరాయ్ బాలీవుడ్ బోల్డ్ మూవీ - రెడ్‌లైట్ ఏరియా కథలతో...
- ●Padi Kaushik Reddy Expulsion | కౌశిక్‌పై వేటు.. అంత సులువేం కాదు
- ●Samantha | జిమ్‌కు "నో" బ్రేక్ - బేబీ బంప్‌తో సమంత వర్కవుట్స్
- ●Countries Where Divorce Is Illegal | ఈ రెండు దేశాల్లో విడాకులు తీసుకోవడం నేరం
- ●Debjani Modak | బిగ్‌బాస్ బ్యూటీ దేబ్జానీ మోదక్ చేసిన తెలుగు సీరియల్స్ ఇవే

Telangana Section 22A Land Issues | 22-ఏ పొరపాటు కాదు.. ఉద్దేశపూర్వకమే!

OTT | డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన మౌనీరాయ్ బాలీవుడ్ బోల్డ్ మూవీ - రెడ్‌లైట్ ఏరియా కథలతో...

Padi Kaushik Reddy Expulsion | కౌశిక్‌పై వేటు.. అంత సులువేం కాదు

Samantha | జిమ్‌కు "నో" బ్రేక్ - బేబీ బంప్‌తో సమంత వర్కవుట్స్






