త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Garuda Seva | తిరుమలలో ఒకే నెలలో రెండోసారి గరుడసేవ

Garuda Seva | తిరుమలలో పున్నమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి గరుడ వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

P

Devotional | Published On Sep 26, 2026, 9.48 pm IST

Garuda Seva | తిరుమలలో ఒకే నెలలో రెండోసారి గరుడసేవ
Advertisement

Garuda Seva | తిరుమలలో పున్నమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి గరుడ వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఒకే నెలలో రెండోసారి గరుడ వాహనసేవ జరగడం విశేషంగా నిలిచింది. ఇటీవల తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లోనూ గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండగా.. పున్నమి సందర్భంగా గ‌రుడ సేవ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. 108 వైష్ణవ దివ్యదేశాల్లో గరుడసేవకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. గరుడ వాహనంపై స్వామివారి దర్శనం చేసుకుంటే సర్వపాపాలు తొలగి, జ్ఞానవైరాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. దాసానుదాస ప్రపత్తికి ప్రతీకగా స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారని ఆలయ సంప్రదాయం చెబుతోంది. ఈ వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో హెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement