Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. బులియన్ మార్కెట్లలో అనిశ్చితి..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి లోహాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమ ఆసియాలో ఏర్పడిన యుద్ధం కారణంగా ఈ లోహాలకు అంతగా డిమాండ్ పెరగలేదు. అప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయిలో ఉండడంతో పెట్టుబడిదారులు ఈ సేఫ్ హావెన్ ఆస్తులపై ఆసక్తి కనబరచలేదు.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి లోహాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమ ఆసియాలో ఏర్పడిన యుద్ధం కారణంగా ఈ లోహాలకు అంతగా డిమాండ్ పెరగలేదు. అప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయిలో ఉండడంతో పెట్టుబడిదారులు ఈ సేఫ్ హావెన్ ఆస్తులపై ఆసక్తి కనబరచలేదు. అయితే యుద్ధం ముగిసి అంతా సద్దుమణిగితే వీటి ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ భౌగోళికంగా అలాంటి వాతావరణం కనిపించడం లేదు. దీంతో వాటి ధరల్లో అస్థిరత నెలకొంది. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2.37 శాతం మేర తగ్గి 4,539 డాలర్ల వద్ద ముగియగా, వెండి ధర 9.03 శాతం పతనమై 75.89 డాలర్ల వద్ద స్థిరపడింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో క్రితం సెషన్ ముగింపులో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3,431 పాయింట్లు పతనమై 1,58,547 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 19,216 పాయింట్లు తగ్గి 2,71,886 వద్ద నిలిచింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,693 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,25,544 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,56,930 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,69,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.9,800 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,385 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,38,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9వేలు తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,770 ఉండగా, 8 గ్రాముల ధర రూ.94,160గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,17,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,77,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,300 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, తులం ధర రూ.2,800గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,90,000 ఉండగా, తులం ధర రూ.2,900 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
ఆగస్టు 21, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
ఆగస్టు 20, 2026

Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే
- ●Starlink | గ్రామీణ భారతానికి స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
- ●Taapsee | థియేటర్లలో కాదు...నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- ●Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?
- ●‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?
- ●Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..

Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే

Starlink | గ్రామీణ భారతానికి స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

Taapsee | థియేటర్లలో కాదు...నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?



