Kedarnath Dham | తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు.. హర హర మహాదేవ్ నామస్మరణలతో మార్మోగిన పుణ్యక్షేత్రం
Kedarnath Dham | దేవభూమి ఉత్తరాఖండ్ (Uttarakhand )లోని పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామ్ (Sri Kedarnath Dham) తలుపులు తెరుచుకున్నాయి. చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా ఆలయ తలుపులను ఇవాళ ఉదయం తెరిచారు.
Kedarnath Dham | దేవభూమి ఉత్తరాఖండ్ (Uttarakhand )లోని పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామ్ (Sri Kedarnath Dham) తలుపులు తెరుచుకున్నాయి. చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా ఆలయ తలుపులను ఇవాళ ఉదయం తెరిచారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి (Uttarakhand CM) పుష్కరసింగ్ ధామి హాజరై తొలి పూజలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంచు కొండల మధ్య కొలువైన ఈ ఆలయం హర హర మహాదేవ్ నామస్మరణలతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా కేదార్‌నాథ్ ఆలయాన్ని అధికారులు రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఏకంగా 51 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు.

ప్రధాని సంతోషం..
సుదీర్ఘ విరామం తర్వాత కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోవడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు భక్తులకు ప్రత్యేకంగా లేఖ రాశారు. కేదార్‌నాథ్ ధామ్, చార్‌ధామ్ యాత్ర మన విశ్వాసానికి, ఐక్యతకు, సుసంపన్నమైన సంప్రదాయాలకు దివ్య ఉత్సవం వంటిదని ప్రధాని పేర్కొన్నారు. ఈ యాత్రల ద్వారా భారతదేశపు సనాతన సంస్కృతిని దర్శించుకునే గొప్ప అవకాశం కలుగుతుందని చెప్పుకొచ్చారు.
రేపు బద్రీనాథ్ ఆలయం..
ఇక ఈ యాత్రలో భాగంగా రేపు అంటే గురువారం ఉదయం బద్రీనాథ్ (Badrinath) ఆలయాన్ని కూడా తెరవనున్నారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 6:15 గంటలకు విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. భూలోక వైకుంఠంగా పిలిచే బద్రీనాథ్ దర్శనం కోసం భక్తులు తరలి వెళ్తున్నారు.
పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. చార్‌ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్ థామ్‌ను సందర్శిస్తుంటారు. పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. చార్‌ధామ్ యాత్ర ఈ నెల 19 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అనుమతిస్తున్నారు.

#WATCH | Kedarnath: The portals of Shri Kedarnath Dham officially open, accompanied by the chanting of Vedic hymns and traditional rituals. pic.twitter.com/fovjBV2Mxh
— ANI (@ANI) April 22, 2026
Also Read..
పహల్గామ్ దాడికి ఏడాది.. ఆ రోజు ఏం జరిగిందంటే..?
ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదు.. పహల్గామ్ మృతులకు ప్రధాని నివాళి
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






