Pahalgam terror attack | పహల్గామ్ దాడికి ఏడాది.. ఆ రోజు ఏం జరిగిందంటే..?
Pahalgam terror attack | గతేడాది సరిగ్గా ఇదే రోజున (ఏప్రిల్ 22) జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు (Pahalgam terror attack) నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే.
Pahalgam terror attack | గతేడాది సరిగ్గా ఇదే రోజున (ఏప్రిల్ 22) జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు (Pahalgam terror attack) నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పచ్చిక బయళ్లపై సేదతీరుతున్న పర్యాటకులే లక్ష్యంగా ముష్కరులు ఘాతుకానికి పాల్పడ్డారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత సమీపంలోని అడవిలోనుంచి వచ్చిన టెర్రరిస్ట్‌లు హిందూ పర్యాటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ముష్కరులు ఒక్కో పర్యాటకుడి వద్దకు వెళ్లి వారి మతాన్ని అడిగి, వారికి ఇస్లామిక్ పద్య పరీక్ష నిర్వహించి నిర్ధారించుకున్న తర్వాతే కాల్చి చంపారు. 10 నిమిషాల పాటు ఈ నరమేధం సాగింది. ఆ తర్వాత వచ్చిన దారిలోనే వారు అడవిలోకి పారిపోయారు. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడింది తామేనంటూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (The Resistance Front) ప్రకటించుకుంది.
సంబరాలు చేసుకున్న ఉగ్రవాదులు
మారణహోమాన్ని కళ్లారా చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి (Eyewitness) దర్యాప్తులో సంచలన విషయాలను వెల్లడించారు.
బైసరాన్ వ్యాలీలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు.. దాడి అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి (terrorists fired in air) సంబరాలు చేసుకున్నట్లు తెలిపారు.
ఆ ఉగ్రవాదులు హతం..
ఇక ఈ దాడికి ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంది. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని మన దళాలు హతమార్చాయి. ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతేడాది జులైలో పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు.
ఉగ్రస్థావరాలు నేలమట్టం..
ఇక ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రస్థావరాలు నేలమట్టమయ్యాయి. ఎప్పటినుంచో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఈ చర్యతో రగిలిపోయింది. భారత్‌ను దొంగదెబ్బ తీయడానికి సరిహద్దు ప్రాంతాలపై కాల్పులు, దాడులకు తెగబడింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, జనావాసాలపై వరుసగా డ్రోన్ దాడులకు పాల్పడింది.
పాక్ ఎయిర్‌బేస్‌లు ధ్వంసం..
సరిహద్దుల్లో శతఘ్నులతో విరుచుకుపడింది. దీంతో పాక్ దాడులను తిప్పికొట్టిన భారత త్రివిధ దళాలు.. దాయాది దేశంలోని పలు వైమానిక, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులను ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీతో పాటు దక్షిణ పంజాబ్, లాహోర్, సియాల్‌కోట్‌కు సమీపంలోని దాదాపు ఎనిమిది పాక్ ఎయిర్‌బేస్‌లు దెబ్బతిన్నాయి. భారత్ దాడిలో దెబ్బతిన్న తమ ఎయిర్‌బేస్‌లను పాక్ పునర్నిర్మించుకుంటోంది.
NIA దర్యాప్తు
ఇక ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా అనేక మంది సాక్షులను విచారించింది. ఉగ్రవాదులకు సాయం చేసిన స్థానికులను గుర్తించి అరెస్ట్ చేసింది. ఇక ఈ దాడి ఘటనపై 1,597 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను ఎన్ఐఏ దాఖలు చేసింది. ఈ కుట్ర వెనుక లష్కరే తోయిబా (LeT) మరియు దాని అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) అగ్రనాయకత్వ పాత్రను అందులో హైలెట్ చేసింది. ఇక ఈ ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా దేశం మొత్తం ఇప్పుడు ఆ దాడి ఘటననను గుర్తు చేసుకుంటోంది. ఈ నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులను స్మరించుకుంటోంది.
Also Read..
ప్రజా శ్రేయస్సు కోసం ఆర్టీసీ సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
ప్రముఖ దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
మహిళల కోసం ప్రత్యేకంగా సెరామిక్ స్మార్ట్ వాచ్.. లాంచ్ చేసిన నాయిస్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Terrorists | ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 23 మందిని టెర్రరిస్టులుగా ప్రకటించిన కేంద్రం
జులై 4, 2026

Bharti Airtel | అమర్నాథ్ యాత్ర మార్గాల్లో ఎయిర్టెల్ ఫుల్ సిగ్నల్.. నెట్‌వర్క్‌ను విస్తరించిన సంస్థ..
జులై 3, 2026

Amarnath Yatra 2026 | అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భారీ వర్షంలోనూ తరలివెళ్తున్న భక్తులు
జులై 3, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



