త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Xbox | లేఆఫ్‌కు గురైన ఎక్స్‌బాక్స్ వైస్‌ప్రెసిడెంట్‌.. 37 ఏళ్ల సుదీర్ఘ‌ ప్ర‌యాణం ముగిసిందంటూ భావోద్వేగ పోస్ట్‌

Xbox | ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ (Microsoft)లో లేఆఫ్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. గేమింగ్ విభాగ‌మైన ఎక్స్‌బాక్స్ (Xbox)లో ప్ర‌పంచ వ్యాప్తంగా 3,200 మందిని తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ లేఆఫ్స్ లిస్ట్‌లో ఎక్స్‌బాక్స్ వైస్ ప్రెసిడెంట్ (Xbox Vice President) కెవిన్ లాచాపెల్ (Kevin LaChapelle) పేరు కూడా ఉంది. సంస్థ లేఆఫ్స్‌తో ఆయ‌న కూడా ఉద్యోగం కోల్పోయారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. సంస్థ‌లో 37 ఏళ్ల సుదీర్ఘ‌ ప్ర‌యాణం ముగిసిందంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు.

D

Business | Published On Jul 8, 2026, 5.02 pm IST

Xbox | లేఆఫ్‌కు గురైన ఎక్స్‌బాక్స్ వైస్‌ప్రెసిడెంట్‌.. 37 ఏళ్ల సుదీర్ఘ‌ ప్ర‌యాణం ముగిసిందంటూ భావోద్వేగ పోస్ట్‌
Advertisement

Xbox | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ (Microsoft) భారీగా లేఆఫ్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. గేమింగ్ విభాగ‌మైన ఎక్స్‌బాక్స్ (Xbox)లో ప్ర‌పంచ వ్యాప్తంగా 3,200 మందిని తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది త‌న‌ మొత్తం వ‌ర్క్‌ఫోర్స్‌లో 20 శాతంతో స‌మానం. ఈ లేఆఫ్స్‌లో భాగంగా జులై 6న 1,600 మంది ఉద్యోగులు త‌మ ఉద్యోగాల‌ను కోల్పోయారు. 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి నాటికి మిగ‌తా లేఆఫ్స్ పూర్త‌వుతాయ‌ని సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక ఈ లేఆఫ్స్ ప్ర‌భావం కేవ‌లం కింద స్థాయి ఉద్యోగుల‌పైనే కాదు.. మైక్రోసాఫ్ట్‌లో 37 ఏళ్లుగా పనిచేస్తున్న ఎక్స్‌బాక్స్ వైస్ ప్రెసిడెంట్ (Xbox Vice President) కెవిన్ లాచాపెల్ (Kevin LaChapelle)పై కూడా ప‌డింది. సంస్థ లేఆఫ్స్‌తో ఆయ‌న కూడా ఉద్యోగం కోల్పోయారు.

37 ఏళ్ల ప్ర‌యాణం ముగిసింది..

ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. లేఆఫ్స్‌కు గురైన వారిలో తాను కూడా ఉన్నానని ఆయ‌న లింక్డ్‌ఇన్ (LinkedIn) ద్వారా వెల్లడించారు. ఈ మేర‌కు భావోద్వేగ పోస్టు పెట్టారు. "ఈ రోజు ఎక్స్‌బాక్స్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారి జాబితాలో నా పేరును కూడా చేర్చుకుంటున్నాను. దీంతో మైక్రోసాఫ్ట్‌లో నా 37 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ముగిసింది" అంటూ త‌న పోస్టులో రాసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా మైక్రోసాఫ్ట్‌లో తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ .. 2015 ఇ3 (E3) ఈవెంట్‌లో 'బ్యాక్‌వర్డ్ కంపాటిబిలిటీ' ఫీచర్‌ను ప్రకటించిన క్షణాలే తన జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎక్స్‌బాక్స్ ఎగ్జిక్యూటివ్ కరీమ్ చౌదరికి (Kareem Choudhry) కెవిన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌లో తనకు దక్కిన అత్యుత్తమ మేనేజర్ ఆయనేనని.. ఇప్పుడు త‌న‌కు మంచి మిత్రుడ‌ని పేర్కొన్నారు.

కెవిన్ లాచాపెల్‌.. 1989లో మైక్రోసాఫ్ట్‌లో త‌న కెరీన్‌ను ప్రారంభించారు. సంస్థ‌లో సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంజనీర్‌గా చేరిన ఆయ‌న ఆ త‌ర్వాత ఎక్స్‌బాక్స్ విభాగంలో చేరారు. ఆయన నేతృత్వంలోనే ఎక్స్‌బాక్స్ 'బ్యాక్‌వర్డ్ కంపాటిబిలిటీ' (Backward Compatibility) ప్రోగ్రామ్ రూపుదిద్దుకుంది. దీని ద్వారా పాత ఎక్స్‌బాక్స్ కన్సోల్ గేమ్‌లను సరికొత్త హార్డ్‌వేర్‌పై కూడా ఆడుకునే వెసులుబాటు లభించింది. ఆ తర్వాత ఆయన 'ఎక్స్‌బాక్స్ క్లౌడ్ గేమింగ్' ప్రాజెక్ట్‌ను నడిపించిన ఇంజనీరింగ్ బృందానికి కూడా నాయకత్వం వహించారు. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో ఎక్స్‌బాక్స్ ఇమేజ్‌ను మార్చ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఓ సీనియ‌ర్ దిగ్గజం లేఆఫ్స్‌కు గుర‌వ‌డం టెక్ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read..

క్యూరింగ్ కాక మేడిగ‌డ్డ కూలిపోయింది : జ‌గ్గారెడ్డి

హ‌రీశ్‌రావు.. ఖ‌మ్మం జిల్లా కొట్టుకుపోయినా ప‌ర్వాలేదా..? : జ‌గ్గారెడ్డి

ట్రూడోకు షాక్‌.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేద‌న్న‌ కెన‌డా

Advertisement
Advertisement