Microsoft | 36 గంటల నిరీక్షణకు తెర.. మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ
Microsoft | 36 గంటలకు పైగా కొనసాగిన తీవ్ర అంతరాయం తర్వాత మైక్రోసాఫ్ట్ తన గ్లోబల్ అవుటేజ్‌ను ఎట్టకేలకు పరిష్కరించింది. అవుట్‌లుక్ (Outlook), టీమ్స్ (Teams), కోపైలట్ (Copilot), షేర్‌పాయింట్ (SharePoint), వన్‌డ్రైవ్ (OneDrive) సహా అన్ని మైక్రోసాఫ్ట్ 365 సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది.
Microsoft | త్రినేత్ర న్యూస్ : 36 గంటలకు పైగా కొనసాగిన తీవ్ర అంతరాయం తర్వాత మైక్రోసాఫ్ట్ తన గ్లోబల్ అవుటేజ్‌ను ఎట్టకేలకు పరిష్కరించింది. అవుట్‌లుక్ (Outlook), టీమ్స్ (Teams), కోపైలట్ (Copilot), షేర్‌పాయింట్ (SharePoint), వన్‌డ్రైవ్ (OneDrive) సహా అన్ని మైక్రోసాఫ్ట్ 365 సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం కలిగించిన సాంకేతిక సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు సంస్థ శనివారం ఉదయం ప్రకటించింది. ఇకపై వినియోగదారులు ఈ-మెయిల్స్, ఇతర సేవలను యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపింది. వినియోగదారులకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది.
నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచే క్రమంలో (network capacity upgrade) తలెత్తిన సాంకేతిక లోపం వల్ల సర్వర్లు స్పందించకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని మైక్రోసాఫ్ట్ వివరించింది. సమస్యకు సైబర్ దాడి లేదా ఏఐ కారణం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అంతరాయం కారణంగా ఎదురైన ఇబ్బందుల పట్ల క్షమాపణలు కోరిన మైక్రోసాఫ్ట్.. అసలు సమస్య ఎందుకు తలెత్తిందో వివరిస్తూ త్వరలోనే ఒక సమగ్ర నివేదికను అందిస్తామని హామీ ఇచ్చింది.
మైక్రోసాఫ్ట్ (Microsoft) సేవల్లో గురువారం రాత్రి నుంచి అంతరాయం నెలకొన్న సంగతి తెలిసిందే. గురువారం భారత కాలమానం ప్రకారం రాత్రి 11:24 గంటలకు అమెరికాలో ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ మెయిల్‌బాక్స్‌లలో తలెత్తిన సమస్యను మైక్రోసాఫ్ట్ మొదట గుర్తించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ అంతరాయం అవుట్‌లుక్, టీమ్స్, కోపైలట్, షేర్‌పాయింట్, ప్లానర్, టు-డూ వంటి వివిధ మైక్రోసాఫ్ట్ 365 సేవలకు వేగంగా విస్తరించింది. టీమ్స్ యాప్‌లో కోర్ మెసేజింగ్, ఆన్‌లైన్ మీటింగ్‌లు యథావిధిగా కొనసాగినప్పటికీ ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్‌పై (Exchange Online) ఆధారపడే క్యాలెండర్, మీటింగ్ షెడ్యూలింగ్ ఫీచర్లకు అంతరాయం కలిగింది.
వినియోగదారులు చాట్‌లను లోడ్ చేయడంలో, అలాగే ఇమెయిళ్లు, క్యాలెండర్‌లు, ఫైల్స్ వంటి పని సమాచారాన్ని పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అంతరాయం కారణంగా అమెరికా సహా కనీసం 74 దేశాల్లో వ్యాపార సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, విమానయాన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలకు అంతరాయం ఏర్పడడంతో దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు సైతం ప్రయాణికులకు ముందస్తు సూచనలు జారీ చేశాయి. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ సంస్థలు ఉపయోగించే ఏఐ సేవల కనెక్టర్లపైనా ప్రభావం పడింది.
Also Read..
ప్రధాని ఫోన్లను ట్యాప్ చేయరు.. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా
రామ్‌లీలాలో నిరసనలకు ఢిల్లీ పోలీసులు కొత్త రూల్స్.. 50,000 మందికి మాత్రమే అనుమతి
స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..
తాజావార్తలు
- ●Ashok Galla | అచ్చ తెలుగు హీరోయిన్‌తో మహేష్‌బాబు మేనల్లుడి మూవీ - షూటింగ్ మొత్తం అమెరికాలోనే!
- ●Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?
- ●Mujeeb | మైనారిటీలకు 1000 కోట్లిస్తమన్నరు.. కానీ 10 రూపాలు కూడా అందలే
- ●TRAI | స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..
- ●Sam Pitroda | ప్రధాని ఫోన్లను ట్యాప్ చేయరు.. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా
- ●Gig Workers' Rally | గిగ్ వర్కర్ల ర్యాలీ.. మహిళా స్కూటీపై రాహుల్ ప్రయాణం

Ashok Galla | అచ్చ తెలుగు హీరోయిన్‌తో మహేష్‌బాబు మేనల్లుడి మూవీ - షూటింగ్ మొత్తం అమెరికాలోనే!

Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?

Mujeeb | మైనారిటీలకు 1000 కోట్లిస్తమన్నరు.. కానీ 10 రూపాలు కూడా అందలే

TRAI | స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..






