Microsoft | మైక్రోసాఫ్ట్ గ్లోబల్ షట్‌డౌన్.. క్షమాపణలు చెప్పిన సంస్థ..
Microsoft | ప్రపంచవ్యాప్తంగా ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలట్ సేవలకు అంతరాయం కలిగించిన గ్లోబల్ ఔటేజ్‌పై మైక్రోసాఫ్ట్ క్షమాపణలు తెలిపింది. గతంలో చేపట్టిన నెట్‌వర్క్ సామర్థ్య విస్తరణలో తలెత్తిన సాంకేతిక సమస్యే తాజా అంతరాయానికి కారణమని స్పష్టం చేసింది. ఇది సైబర్ దాడి కాదని వెల్లడించింది.
Technology | Published On Nov 14, 2026, 10.59 am IST
Microsoft | ప్రపంచవ్యాప్తంగా ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలట్ సేవలకు అంతరాయం కలిగించిన గ్లోబల్ ఔటేజ్‌పై మైక్రోసాఫ్ట్ క్షమాపణలు తెలిపింది. గతంలో చేపట్టిన నెట్‌వర్క్ సామర్థ్య విస్తరణలో తలెత్తిన సాంకేతిక సమస్యే తాజా అంతరాయానికి కారణమని స్పష్టం చేసింది. ఇది సైబర్ దాడి కాదని వెల్లడించింది.
18 గంటలపాటు నిలిచిపోయిన సేవలు..
ప్రపంచవ్యాప్తంగా తమ సేవలకు అంతరాయం కలగడంపై మైక్రోసాఫ్ట్ తన వినియోగదారులు, భాగస్వాములకు క్షమాపణలు చెప్పింది. ఔట్‌లుక్ ఈమెయిల్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలట్ సహా పలు సేవలు దాదాపు 18 గంటల పాటు నిలిచిపోవడంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసిన సంస్థ.. ప్రస్తుతం తమ సేవల్లో చాలావరకు పునరుద్ధరణ జరిగిందని, స్థిరంగా పనిచేస్తున్నాయని తెలిపింది. గతంలో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన అప్‌గ్రేడ్ సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్య, ఇటీవల చేసిన మరో నెట్‌వర్క్ మార్పు నేపథ్యంలో బయటపడిందని వివరించింది. ఈ ఘటనకు సైబర్ దాడులు లేదా కృత్రిమ మేధ (ఏఐ) ఏజెంట్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. వినియోగదారులు, భాగస్వాములు తమ సేవలపై ఉంచిన నమ్మకానికి తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తామని, కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నామని పేర్కొంది.
దశలవారీగా పునరుద్ధరణ చర్యలు..
సేవలను పునరుద్ధరించే క్రమంలో తొందరపడకుండా దశలవారీగా చర్యలు చేపట్టినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ప్రతి దశలోనూ సేవల స్థిరత్వాన్ని పరిశీలించిన తర్వాతే తదుపరి ప్రాంతాలకు పునరుద్ధరణ చేపట్టామని తెలిపింది. దీనివల్ల కొంత ఎక్కువ సమయం పట్టినప్పటికీ, సేవలు తిరిగి స్థిరంగా పనిచేసేలా చూడగలిగామని వివరించింది. అంతరాయానికి కారణమైన ప్రధాన సమస్యను పరిష్కరించామని, ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులు, ప్రాంతాలకు సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. సమగ్ర పరిశీలన పూర్తయిన తర్వాత ఈ ఘటనపై పూర్తి నివేదికను విడుదల చేస్తామని వెల్లడించింది.
74 దేశాల్లో కార్యకలాపాలపై ప్రభావం..
ఈ అంతరాయం కారణంగా అమెరికా సహా కనీసం 74 దేశాల్లో వ్యాపార సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, విమానయాన కార్యకలాపాలపై ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలకు అంతరాయం ఏర్పడడంతో దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు సైతం ప్రయాణికులకు ముందస్తు సూచనలు జారీ చేశాయి. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ సంస్థలు ఉపయోగించే ఏఐ సేవల కనెక్టర్లపైనా ప్రభావం పడింది. అంతరాయాలను పర్యవేక్షించే డౌన్‌డిటెక్టర్ గణాంకాల ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఔట్‌లుక్ సేవలపై ఫిర్యాదులు గరిష్ఠంగా 1,38,058కు చేరాయి. అదే రోజు సాయంత్రానికి ఈ సంఖ్య 34,490కు తగ్గింది. మైక్రోసాఫ్ట్ 365 సేవలపై సాయంత్రం 5:47 గంటల సమయంలో సుమారు 13 వేల ఫిర్యాదులు నమోదవగా, టీమ్స్ సేవలపై 763 మంది సమస్యలు నివేదించారు. పూర్తి స్థాయి సమీక్ష అనంతరం సంస్థ విడుదల చేయనున్న నివేదికలో ఈ అంతరాయానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | తెలంగాణ ప్రజలకు కావాల్సింది జిమ్మిక్కులు కాదు.. జవాబుదారీతనం: హరీశ్ రావు
- ●KTR | రాహుల్ గాంధీ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏది?: కేటీఆర్
- ●Kangana Ranaut | గాంధీ కుటుంబంపై వివాదాస్పద పోస్ట్.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్
- ●Traffic Restrictions | గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ.. 12 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●IRCTC Tour | ఐదు రోజులు ప్రకృతి ఒడిలో.. చలికాలంలో దండకారణ్య అందాలు చూసొద్దామా..?
- ●Air India | సౌదీ అరేబియాకు సర్వీసులు రద్దు.. మరోసారి పొడిగించిన ఎయిర్ ఇండియా

Harish Rao | తెలంగాణ ప్రజలకు కావాల్సింది జిమ్మిక్కులు కాదు.. జవాబుదారీతనం: హరీశ్ రావు

KTR | రాహుల్ గాంధీ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏది?: కేటీఆర్

Kangana Ranaut | గాంధీ కుటుంబంపై వివాదాస్పద పోస్ట్.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్

Traffic Restrictions | గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ.. 12 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు






