త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్థిరంగా కొన‌సాగుతున్న బంగారం, వెండి ధ‌ర‌లు.. మార్కెట్ల దిశ ఎటు వైపు..?

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో మ‌ళ్లీ యుద్ధ ఉద్రిక్త‌త‌లు నెల‌కొన‌డంతోపాటు అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందంపై ఎలాంటి పురోగ‌తి లేక‌పోవ‌డంతో పెట్టుబ‌డిదారుల్లో మళ్లీ ఆందోళ‌న మొద‌లైంది. దీంతో గ‌త మూడు ట్రేడింగ్ సెష‌న్ల‌లో స్టాక్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త నెల‌కొంది.

S

Business | Published On Jun 3, 2026, 11.28 am IST

Gold And Silver Prices Today | స్థిరంగా కొన‌సాగుతున్న బంగారం, వెండి ధ‌ర‌లు.. మార్కెట్ల దిశ ఎటు వైపు..?
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో మ‌ళ్లీ యుద్ధ ఉద్రిక్త‌త‌లు నెల‌కొన‌డంతోపాటు అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందంపై ఎలాంటి పురోగ‌తి లేక‌పోవ‌డంతో పెట్టుబ‌డిదారుల్లో మళ్లీ ఆందోళ‌న మొద‌లైంది. దీంతో గ‌త మూడు ట్రేడింగ్ సెష‌న్ల‌లో స్టాక్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త నెల‌కొంది. బెంచ్ మార్క్ సూచీలు భారీగా ప‌త‌న‌మై పెట్టుబ‌డిదారుల‌కు తీవ్ర‌మైన న‌ష్టాల‌ను మిగిల్చాయి. ఇక బంగారం, వెండి ధ‌ర‌ల్లోనూ తీవ్ర అస్థిర‌త నెల‌కొంది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర 0.57 శాతం త‌గ్గి ఔన్స్‌కు 4,463 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.84 శాతం త‌గ్గి 74.51 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 361 పాయింట్లు త‌గ్గి 1,58,985 వ‌ద్ద ఉండగా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1320 పాయింట్లు త‌గ్గి 2,65,387 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు స్థిరంగా కొన‌సాగుతున్నాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,225 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,21, 800 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,52,250 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,22,500 గా ఉంది. కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,500 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16,000గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,45,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,50,000గా ఉంది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,972 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.95,776గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,19,720 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,97,200గా ఉంది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,80,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,800గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లోనూ ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,90,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,900 గా ఉంది.

Advertisement
Advertisement